
నాని(Nani) -సాయిపల్లవి-కృతి శెట్టి జంటగా.. టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో.. వెంకట్ బోయినపల్లి నిర్మించిన సినిమా "శ్యామ్ సింగ రాయ్" (Shyam Singha Roy). కలకత్తా నేపథ్యంలో రూపొందిన ఈమూవీ ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రి-రిలీజ్ కు సంబంధించిన డేట్ ను ఫిక్స్ చేసి.. పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈనెల 14న సాయంత్రం 5 గంటలకు శ్యామ్ సింగరాయ్ ప్రి-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు.
చాలా వరకు టాలీవుడ్ మూవీస్.. ప్రి-రిలీజ్ ఈవెంట్స్ హైదరాబాద్ లోనే జరుగుతుండగా.. ఈ మూవీ టీమ్ మాత్రం వరంగల్ లో ఈవెంట్ ను చేయబోతున్నారు. ఓరుగల్లులోని "రంగలీల మైదాన్" లో Shyam Singha Roy ప్రి రిలీజ్ జరగబోతోంది.
1970 వ టైంలో కలకత్తా బ్యాక్ డ్రాప్ తో "శ్యామ్ సింగ రాయ్" సినిమా తెరకెక్కింది. కలకత్తాకి దగ్గరలో ఉన్న ఓ విలేజ్ లో ఈమూవీ షూటింగ్ జరిగింది. నాని ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. అంతే కాదు డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నారు. అటు సాయి పల్లవి కూడా బెంగాలీ అమ్మాయి గెటప్ లో కనిపించబోతోంది. సాయి పల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కూడా ఈమూవీలో హీరోయిన్లు గా నటిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో"శ్యామ్ సింగ రాయ్" కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 24న ఈ సినిమాకు పోటీగా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయినా సరే ఎక్కడా తగ్గకుండా.. రిలీజ్ డేట్ మార్చకుండా.. ప్రమోషన్స్ తో సత్తా చాటుతున్నారు "శ్యామ్ సింగ రాయ్" టీమ్. సినిమా సక్సెస్ పై నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
Also Read: Ntr Costly Watch: తారక్ కాస్ట్లీ వాచ్.. ఎంతో తెలుసా..? త్రివిక్రమ్ అప్పుడు ఊరికే చెప్పలేదు...
ఈ సినిమా గురించి నిర్మాత వెంకట్ బోయినపల్లి మాట్లాడుతూ...అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుందన్నారు. తాను ఇంకో సినిమా చేయాలి అనుకుని.. సడెన్ గా ఈ సినిమాను స్టార్ట్ చేశానన్నారు. నానిపై నమ్మకంతో బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీపడలేదన్నారు వెంకట్. తాను నానిని నమ్మితే.. నాని రాహుల్ కథను నమ్మారని..రాహుల్ మేకింగ్ ఆడియన్స్ ను మెప్పిస్తుందన్నారు. సాయి పల్లవి,కృతిశెట్టి, మడోన్నా లు పోటా పోటీగా అద్భుతంగా నటించారన్నారు. శ్యామ్ సింగ రాయ్ తప్పకుండా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తుందన్నారు వెంకట్.