Pushpa: సమంత ఐటెం సాంగ్ కి బ్రహ్మానందం వర్షన్... చూస్తే మతిపోవాల్సిందే

Published : Dec 12, 2021, 09:10 AM IST
Pushpa: సమంత ఐటెం సాంగ్ కి బ్రహ్మానందం వర్షన్... చూస్తే మతిపోవాల్సిందే

సారాంశం

మీమ్స్ రాజాలకు ముడి సరుకుగా మారిన బ్రహ్మానందం ని ఐటెం సాంగ్స్ లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. సాంగ్ ని ఎడిట్ చేసి బ్రహ్మానందం సినిమాలోని సీన్స్ తో ఓ వీడియో రూపొందించారు. 


స్టార్ లేడీ సమంత (Samantha)కెరీర్ లో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప చిత్రంతో ఆమె ఐటెం భామగా మారారు. ఇక డిసెంబర్ 10న ఈ ఐటెం సాంగ్ కి లిరికల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఊర మాస్ బీట్ లో సాగిన  'ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. '   సాంగ్ లో లిరిక్స్ కొంచెం పచ్చిగా సాగాయి.సమంత ఐటెం సాంగ్ కి మిక్స్డ్ స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో బ్రహ్మానందం వర్షన్ వైరల్ అవుతుంది. 

 

మీమ్స్ రాజాలకు ముడి సరుకుగా మారిన బ్రహ్మానందం (Bramhanandam) ని ఐటెం సాంగ్స్ లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. సాంగ్ ని ఎడిట్ చేసి బ్రహ్మానందం సినిమాలోని సీన్స్ తో ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ సాంగ్ కి ట్యూన్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్... సదరు సాంగ్ పై ట్విట్టర్ లో స్పందించారు. అద్భుతం అంటూ కామెంట్ చేశారు. దీనితో పుష్ప ఐటెం సాంగ్ బ్రహ్మానందం వర్షన్ మరింత పాపులర్ కావడం జరిగింది. 

 

Also read Allu Arjun: షాకిస్తున్న `పుష్ప` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. తగ్గేదెలే అనిపిస్తుందిగా..
కాగా నేడు పుష్ప (Pushpa)ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ వేదికగా ఘనంగా జరగనుంది. టాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరుకానున్న ఈ ఈవెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పుష్ప విడుదలకు  ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా... ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. పుష్ప డిసెంబర్  17న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. సుకుమార్ రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పుష్ప నిర్మిస్తున్నారు. పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. అల్లు అర్జున్(Allu Arjun) కి జంటగా రష్మిక మందాన నటిస్తున్నారు. 

Also read pushpa:'పుష్ప 'ఐటమ్‌ సాంగ్. ఆ పాటకు కాపీనా? నిజం ఎంత

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు