తనని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. హీరో నాని సమాధానం విన్నారా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 23, 2022, 10:07 AM IST
తనని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. హీరో నాని సమాధానం విన్నారా

సారాంశం

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ చిత్ర వసూళ్లపై కోవిడ్ ప్రభావం పడిందనే చెప్పాలి. 

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ చిత్ర వసూళ్లపై కోవిడ్ ప్రభావం పడిందనే చెప్పాలి. శ్యామ్ పాత్రలో నాని నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. దర్శకుడు రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో నాని అప్ కమింగ్ యంగ్ డైరెక్టర్ గా, శ్యామ్ సంగ రాయ్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించాడు. అప్ కమింగ్ డైరెక్టర్ గా సరదాగా కనిపించిన నాని.. శ్యామ్ సింగ రాయ్ పాత్రలో పవర్ ఫుల్ గా ఉంటూనే ఎమోషనల్ గా కూడా మెప్పించాడు. 

ఈ చిత్రం నుంచి తాజాగా ఓ డిలీటెడ్ సన్నివేశాన్ని విడుదల చేశారు. శ్యామ్ సింగ రాయ్ గా నాని.. వేశ్యలందరితో కూర్చుని ఉంటాడు. వారి కోసం నాని ఓ కవిత రాసి వినిపిస్తాడు. వారిలో ఒక వేశ్య ఇంత తెలిసిన వాడివి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. 

ఆమెకు నాని ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. 'ఖచ్చితంగా చేసుకుంటాను.. నిన్ను ప్రేమించిన రోజు ' అని కూల్ గా బదులిస్తాడు. నాని సమాధానం విని ఆమె కూడా ఇంప్రెస్ అవుతుంది. ఈ చక్కటి సన్నివేశాన్నిసినిమా నుంచి ఎందుకు తొలగించారు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 

ఈ చిత్రంలో నానికి జోడిగా సాయి పల్లవి, కృతి శెట్టి నటించారు. మలయాళీ నటి మడోనా సెబాస్టియన్ లాయర్ పాత్రలో కనిపించింది. దర్శకుడు రాహుల్ 'టాక్సీ వాలా' తర్వాత మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..