
తౌక్టే తుఫాన్ ముంబాయి నగరాన్ని అతలాకుతలం చేస్తుంది. ఓ వైపు కరోనా మహమ్మారితో వణికిపోతుంటే, మరోవైపు తుఫాన్ విధ్వంసంతో గజగజ వణికిపోతుంది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. అయితే ఈ తుఫాన్ ఎంతటి భయంకరమైనదో హాట్ భామ శృతి హాసన్ వెల్లడించింది. తాను స్వయంగా ఈ తుఫాన్‌ని చూశానని తెలిపింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోని పంచుకుంది.
`ఈ తుఫాన్‌ని ఎప్పటికీ అంతం కావచ్చు. ఇలాంటిది తానెప్పుడూ చూడలేదు. దీని ప్రభావంతో నా రూమ్ కిటికీలు పాడు కావచ్చు. ఇది చాలా భయంకరంగా ఉంది. గతేడాది నేను ఇక్కడే ఒంటరిగా లాక్‌డౌన్‌లో ఉన్నా. హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. అప్పుడు ఇలాంటిది జరగలేదు. కానీ ఇప్పుడు భయంగా ఉంది` అని వెల్లడించింది. అంతేకాదు తుఫాన్ ఎలా ఉందో ఓ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది.
ప్రస్తుతం శృతి హాసన్ ముంబయిలోని తన సొంత ఫ్లాట్‌లో ఉంటోంది. అయితే తన ప్రియుడు శాంతనుతో కలిసి ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఉందట. `నా బెస్టీస్‌తో లాక్‌డౌన్‌లో` అని ఇటీవల ఆయనతో ఉన్న ఫోటోలను పంచుకుంది శృతి. లాక్ డౌన్ సమయంలో ఇలా ఎంజాయ్ చేస్తున్నావా? పండగా చేస్కో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో ప్రభాస్ సరసన `సలార్`లో నటిస్తుంది. తమిళంలో `లాభం` చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.