కాలేజ్‌ ప్రొఫేసర్‌ వేధింపులను బయటపెట్టిన నటి, సింగర్‌ సౌందర్య

Published : May 18, 2021, 07:42 AM IST
కాలేజ్‌ ప్రొఫేసర్‌ వేధింపులను బయటపెట్టిన నటి, సింగర్‌ సౌందర్య

సారాంశం

తమిళ టీవీ నటి, సూపర్‌ సింగర్‌ షో ఫేమ్‌ సౌందర్య బల నందకుమార్‌ తనకు ఎదురైన వేధింపులను బయటపెట్టింది. ఓ ప్రొఫేసర్‌ తనతో ఎలా అభ్యంతరంగా వ్యవహరించారో వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన చేదు అనుభవాలను వెల్లడించారు.

తమిళ టీవీ నటి, సూపర్‌ సింగర్‌ షో ఫేమ్‌ సౌందర్య బల నందకుమార్‌ తనకు ఎదురైన వేధింపులను బయటపెట్టింది. ఓ ప్రొఫేసర్‌ తనతో ఎలా అభ్యంతరంగా వ్యవహరించారో వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన చేదు అనుభవాలను వెల్లడించారు. ఆమె చెబుతూ, `నువ్వంటే ఇష్టం. నా కోరిక తీరిస్తే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నిన్ను చూస్తే చాలు.. ` ప్రొఫేసర్‌ అసభ్యకరంగా చేసిన చాటింగ్‌ని ఆమె స్క్రీన్‌ షాట్‌ని పంచుకుంది. 

`ఒక మహిళతో ఓ ప్రొఫేసర్‌ మాట్లాడే విధానం ఇది. సిగ్గుచేటు. అతని ప్రొఫైల్‌ చూస్తే మధురైకి చెందిన ప్రొఫేసర్‌ అని అర్థమవుతుంది. కాలేజ్‌లో అతని చుట్టూ ఉండే బాలికలు జాగ్రత్తగా, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నా. ఇలాంటి వేధవలను ఏం చేయాలి? ఖచ్చితంగా దీనికి అతని మూల్యం చెల్లించాలి. ఇలాంటి ప్రొఫేసర్‌ ఉన్న కాలేజ్‌లోని అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి` అని హెచ్చరించింది. 

ప్రస్తుతం ఆ వ్యక్తిని ట్రాక్ చేస్తున్నానని, అతని గురించి అన్ని వివరాలు సేకరించి అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలియజేసింది. అంతే కాదు, ఆ ప్రొఫెసర్ పనిచేసే కాలేజ్‌ని గుర్తించి, అక్కడి యాజమాన్యానికి కూడా అతని బుద్ధిని తెలియజేస్తానని, ఇలాంటి వారిని అస్సలు వదిలే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెప్పేసింది. సౌందర్య నిర్ణయంపై, ధైర్యంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సీరియల్స్‌లోనే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ `కబాలి`, దళపతి విజయ్ `మాస్టర్` వంటి చిత్రాలలో నటించింది సౌందర్య. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా