కోలీవుడ్‌లో కొనసాగుతున్న కరోనా విషాదంః నటుడు, దర్శకుడి సతీమణి కన్నుమూత

Published : May 18, 2021, 08:55 AM IST
కోలీవుడ్‌లో కొనసాగుతున్న కరోనా విషాదంః నటుడు, దర్శకుడి సతీమణి కన్నుమూత

సారాంశం

కరోనా అనేక మంది సినీ ప్రముఖులను బలితీసుకుంటుంది. కోలీవుడ్‌లో కరోనాతో వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఓ రకంగా కోలీవుడ్‌ని కరోనా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా మరో నటుడు, దర్శకుడి భార్య కన్నుమూశారు.

కరోనా అనేక మంది సినీ ప్రముఖులను బలితీసుకుంటుంది. కోలీవుడ్‌లో కరోనాతో వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఓ రకంగా కోలీవుడ్‌ని కరోనా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా మరో నటుడు, దర్శకుడి భార్య కన్నుమూశారు. నటుడు నితీష్‌ వీరా కరోనాకి బలయ్యాడు. కరోనా సోకడంతో నితీష్‌ వీరాని స్థానికి ఓమందూర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం కన్నుమూశారు. `పుడుకోట్టే, వెన్నెల కబడ్డీ కుళు`, `కాలా అసురన్‌` వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన నితీష్‌ వీరా నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన `లాభం`లో నితీష్‌ వీరా కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదల కానుంది. 

మరోవైపు దర్శకుడు అరుణ్‌ రాజ్‌ కామరాజు సతీమణి హిందూజా కరోనాతో కన్నుమూశారు. ఆమెకి ఇటీవల కరోనా సోకడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆదివారం రాత్రి పరిస్ఙితి విషమించడంతో కన్నుమూశారు. దర్శకుడు సతీమణి హిందూజాకి, నటుడు నితీష్‌ వీరాలకు తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. నటుడు, ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధి స్టాలిన్‌, శివకార్తికేయన్‌ వంటి ప్రముఖులు హిందూజా భౌతిక కాయానికి నివాళ్లు అర్పించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?