ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలా..? శృతిహాసన్ కామెంట్స్!

Published : Apr 03, 2019, 12:40 PM IST
ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలా..? శృతిహాసన్ కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్, కోలివుడ్ భాషలతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నటి శృతిహాసన్ కొంతకాలంగా లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సేల్ తో డేటింగ్ చేస్తోంది. 

టాలీవుడ్, కోలివుడ్ భాషలతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నటి శృతిహాసన్ కొంతకాలంగా లండన్ కి చెందినథియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సేల్ తో డేటింగ్ చేస్తోంది.

వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం, ఫ్యామిలీ పార్టీలకు, ఈవెంట్ లకు హాజరవ్వడంతో వీరి రిలేషన్షిప్ బయటపడింది. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నప్పటికీ  ఇప్పటివరకు శృతి పెళ్లి ఊసెత్తలేదు.

తాజాగా ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా.. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనేముంది..? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని తెలిపింది. పెళ్లి విషయంలో ఇతర మహిళలతో పోలిస్తే తనకున్న అభిప్రాయం వేరని, ప్రస్తుతం పెళ్లి చేసుకోవడం లేదని వెల్లడించింది. పెళ్లి విషయంలో తొందర లేదని, ప్రేమలో ఉంటే ఫలానా సమయంలోనే పెళ్లి చేసుకోవాలనేముంది..? ప్రేమ అలాంటి డిమాండ్స్ ఎప్పుడూ చేయదని చెప్పుకొచ్చింది.

శృతి చివరగా తెలుగులో నటించిన సినిమా 'కాటమరాయుడు'. ఆ తరువాత మరో సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మ్యూజిక్ ఆల్బమ్స్ పూర్తి చేసే పనిలో పడింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా