'లక్ష్మీస్ ఎన్టీఆర్' మ్యూజిక్ డైరెక్టర్ పై ఫిర్యాదు!

Published : Apr 03, 2019, 11:56 AM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' మ్యూజిక్ డైరెక్టర్ పై ఫిర్యాదు!

సారాంశం

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు అందింది. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు అందింది.

తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కించపరుస్తూ కళ్యాణ్ మాలిక్ మాట్లాడారని సగర (ఉప్పర) కుల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం కడప జిల్లా అధ్యక్షుడు మాదాసు మురళి, సంఘం నాయకులతో కలిసి ప్రొద్దుటూరు టూటౌన్ ఎస్ ఐ మధుమల్లేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర సమీక్ష ఓ ప్రైవేట్ ఛానెల్ లో ప్రసారమైందని, అందులో ఆ చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ ఉప్పర కులస్తులను కించపరుస్తూ 'ఉప్పరసోదీ', 'ఉప్పర పనికిమాలిన సోదీ' అంటూ మాట్లాడారని చెప్పారు. తమను కించపరిచేలా మాట్లాడిన అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

PREV
click me!

Recommended Stories

Suspense Thriller OTT: మూడు మరణాలు, ఒకే అనుమానం! ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్, ఎక్కడ చూడొచ్చంటే?
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?