మహేష్‌కి థ్యాంక్స్ అంటూ.. హృతిక్‌, రానా, తమన్నాలను సవాల్‌ చేసిన శృతి

Published : Aug 12, 2020, 08:13 PM ISTUpdated : Aug 12, 2020, 08:15 PM IST
మహేష్‌కి థ్యాంక్స్ అంటూ.. హృతిక్‌, రానా, తమన్నాలను సవాల్‌ చేసిన శృతి

సారాంశం

మహేష్‌తోపాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన కమల్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటింది. అంతేకాదు తనని నామినేట్‌ చేసినందుకు మహేష్‌కి, దేవికి కృతజ్ఞతలు తెలిపింది. తన వంతుగా మరో ముగ్గురిని ఎంపిక చేసింది. 

సినిమా తారలు గ్రీన్‌ ఛాలెంజ్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌కి విశేష ఆదరణ లభిస్తుంది. టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో సినీ సెలబ్రిటీలు భాగం కావడంతో మరింతగా ఊపందుకుంది. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, నాగార్జున, సమంత వంటి స్టార్స్ పాల్గొని మొక్కలు నాటారు. అదే సమయంలో మిగతా స్టార్స్ ని ఉత్తేజ పరిచారు. 

అందులో భాగంగా ఇటీవల మహేష్‌బాబు తన బర్త్ డే రోజున గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. తమిళ దళపతి విజయ్‌, ఎన్టీఆర్‌లకు సవాల్‌ విసిరాడు. ఇప్పటికే వారు స్పందించారు. నిన్న విజయ్‌ మొక్కలు నాటి ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందుకు మహేష్‌ సైతం ధన్యవాదాలు తెలిపారు. 

మహేష్‌తోపాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన కమల్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటింది. అంతేకాదు తనని నామినేట్‌ చేసినందుకు మహేష్‌కి, దేవికి కృతజ్ఞతలు తెలిపింది. తన వంతుగా మరో ముగ్గురిని ఎంపిక చేసింది. బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, ఇటీవలే కొత్తగా పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టిన రానా, అలాగే తోటి నటి, మిల్కీబ్యూటీ తమన్నాకి సవాల్‌ విసిరింది.

ఇక రెండేళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ఈ హాట్‌ భామ గతేడాది రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రవితేజ సరసన `క్రాక్‌`తోపాటు  పవన్‌కి మూడోసారి జోడిగా `వకీల్‌ సాబ్‌`, అలాగే తమిళంలో `లాభం` చిత్రంలో నటిస్తుంది. అలాగే ఇటీవల సొంతంగా ఓ వీడియో సాంగ్‌ని రూపొందించి మెస్మరైజ్‌ చేసిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి