ఒక్క దర్శకుడి కోసం ఇద్దరు బిగ్‌ స్టార్స్ ఫైట్‌..!

Published : Aug 12, 2020, 07:48 PM IST
ఒక్క దర్శకుడి కోసం ఇద్దరు బిగ్‌ స్టార్స్ ఫైట్‌..!

సారాంశం

కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ `కేజీఎఫ్‌` చిత్రంతో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యారు. కోలార్‌ గోల్డ్ మైనింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా స్టార్‌ హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్నారు.

హిట్‌ దర్శకుడి వెంట హీరోలు పడటం కామన్‌. ఇప్పుడు ఇద్దరు బిగ్‌ స్టార్స్ ఓ దర్శకుడి కోసం ఫైట్‌ చేస్తున్నారు. నేను ముందంటే.. నేను ముందు అని గొడవ పడుతున్నారు. వాళ్లెవరో కాదు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, త్వరలో పాన్‌ ఇండియా స్టార్‌ కాబోతున్న ఎన్టీఆర్‌. వీరిద్దరు పోటీపడేది `కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కోసం. మరి ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. 

కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ `కేజీఎఫ్‌` చిత్రంతో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యారు. కోలార్‌ గోల్డ్ మైనింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా స్టార్‌ హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్నారు. వారిలో చాలా మంది స్టార్లున్నప్పటికీ ఫైనల్‌గా ప్రభాస్‌, ఎన్టీఆర్‌ మధ్య పోటీ నెలకొంది. 

అయితే ఇప్పటికే ప్రభాస్‌కి ఓ కథ చెప్పి ఒప్పించాడు ప్రశాంత్‌ నీల్‌. ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫమ్‌ అని అంటున్నారు. `కేజీఎఫ్‌` నిర్మాతలతోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరోవైపు ఎన్టీఆర్‌కి కూడా ఇటీవల సీన్‌ వైజ్‌గా కథని నెరేట్‌ చేశాడని తెలుస్తుంది. అయితే వీరిద్దరిలో మొదట ఎవరితో ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్‌ `ఆర్‌ ఆర్ ఆర్‌`లో నటిస్తున్నాడు. ఇది పూర్తవడానికి ఇంకా టైమ్‌ పడుతుంది. ఇప్పట్లో షూటింగ్‌లు ప్రారంభమయ్యేలా లేవు. దీంతోపాటు త్రివిక్రమ్‌తో సినిమా కూడా కమిట్‌ అయ్యారు. దీని తర్వాత అదే ప్రారంభం కానుంది. దాన్ని కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. 

మరోవైపు ప్రస్తుతం ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తవడానికి ఇంకా చాలా టైమ్‌ పడుతుంది. ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ నాగ్‌ అశ్విన్‌తో సైన్స్ ఫిక్షన్‌ సినిమాలో నటించనున్నారు. ఇది పూర్తవడానికి ఏడాది పైనే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఎప్పుడుంటుందనేది సస్పెన్స్ గా మారింది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` భవిష్యత్‌ ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ఇందులో విలన్‌ పాత్ర అయిన అధీరగా నటిస్తున్న సంజయ్ దత్‌కి లంగ్‌ కాన్సర్‌ వచ్చింది. దీంతో ఆయన షూటింగ్‌లో పాల్గొనే ఛాన్స్ లేదు. పైగా ఆయనపై, హీరో యశ్‌పై కీలక సన్నివేశాలను, రెండు భారీ ఫైట్స్ ని చిత్రీకరించాల్సి ఉంది. సంజయ్‌ క్యాన్సర్‌కి గురి కావడంతో ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సంక్రాంతి బరిలో దిగాలనే ఆశలపై నీళ్ళు చల్లినట్టయ్యింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి