నేనస్సలు భయపడా..ఏం చేసుకుంటారో చేసుకోండి.. జాన్వీ బోల్డ్ కమెంట్

Published : Aug 12, 2020, 06:45 PM IST
నేనస్సలు భయపడా..ఏం చేసుకుంటారో చేసుకోండి.. జాన్వీ బోల్డ్ కమెంట్

సారాంశం

నెపోటిజానికి సంబంధించి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌పై కూడా ఇటీవల విమర్శలు వచ్చాయి. ఆమె తండ్రి బోనీ కపూర్‌కి సినీ నేపథ్యమే అనే విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఈ అమ్మడు స్పందించింది. మామూలుగా స్పందన కాదు, చాలా ఘాటుగా రియాక్ట్ అవడం విశేషం.

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ తొలి చిత్రం `దడఖ్‌`తో మెప్పించింది. క్యూట్‌ అందాలతో అలరించింది. ఆమె నటించిన రెండో చిత్రం `గుంజన్‌ సక్సేనా` బుధవారం నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. సినిమాకి ప్రస్తుతానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే జాన్వీ మాత్రం రెచ్చిపోయింది. తాను ఎవరికీ బయపడేది లేదని చెప్పింది. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండని వెల్లడించింది. మరి జాన్వీ ఇంతటి బోల్డ్ కమెంట్స్ కి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. 

ఇటీవల బాలీవుడ్‌లో నెపోటిజం బాగా చర్చనీయాంశంగా మారింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఈ నినాదం బాగా ఊపందుకుంది. స్టార్‌ వారసులే ఇండస్ట్రీని ఏలుతున్నారని, కొత్త వాళ్ళని, ఇండస్ట్రీనకి చెందని వాళ్ళని రానివ్వడం లేదు, ఎదగనివ్వడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో భాగంగా శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌పై కూడా ఇటీవల విమర్శలు వచ్చాయి. ఆమె తండ్రి బోనీ కపూర్‌కి సినీ నేపథ్యమే అనే విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఈ అమ్మడు స్పందించింది. మామూలుగా స్పందన కాదు, చాలా ఘాటుగా రియాక్ట్ అవడం విశేషం. 

`గుంజన్‌ సక్సేనా` విడుదలైన నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి టాలెంట్‌ లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌తో భారీ అవకాశాలు అందుకుంటోందనే విమర్శలు జాన్వీపై వచ్చాయి. అంతేకాదు ఆమెని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ, సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. ఆడియెన్స్ మది దోచుకోవడం నాకు ముఖ్యం. అందుకోసం మరిన్ని భిన్నమైన కథలు ఎంచుకుంటూ నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తా. అప్పుడైనా నాపై విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావిస్తున్నా` అని తెలిపింది. 

అంతటితో ఆగలేదు.. ఇంకా స్పందిస్తూ, సోషల్‌ మీడియాలో నాపై ట్రోలింగ్‌ జరుగుతుంది. ఆ విమర్శలకు నేను అస్సలు బయపడను. నా సోషల్‌ మీడియా పేజ్‌లో వచ్చే కామెంట్స్ ని డిజేబుల్‌ చేయను. అలాగని వాటిని చదవను. నాపై ఎన్ని విమర్శలు వచ్చినా, వాటిని ఎలా తీసుకోవాలనేది నాకు బాగా తెలుసు. ఆ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నా. ఎవరేమన్నా, ఐ డోంట్‌ కేర్‌` అని మండిపడింది. మరి దీనిపై ఆడియెన్స్, నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `రూహి అఫ్టాజా`, `దోస్తానా 2` చిత్రాల్లో నటిస్తుంది. మరో భారీ చిత్రం `తఖ్త్`లో నటించాల్సి ఉంది. ఇది కరణ్‌ జోహార్‌ బ్యానర్‌లో భారీ మల్టీస్టారర్‌గా రూపొందబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్