పవన్ కళ్యాణ్ వల్లే నేను స్టార్ నయ్యానంటున్న శృతి

Published : Mar 23, 2017, 11:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
పవన్ కళ్యాణ్ వల్లే నేను స్టార్ నయ్యానంటున్న శృతి

సారాంశం

రేపే పవన్- శృతిల కాటమరాయుడు సినిమా విడుదల పవన్ సరసన గతంలో గబ్బర్ సింగ్ మూవీతో హిట్ కొట్టిన శృతి కాటమరాయుడు సినిమాతో మరోసారి ఖుషీగా ఉన్నానంటున్న సుందరి  

మెగా, పవర్ స్టార్స్  అభిమానుల మోస్ట్ అవైటెడ్ మూవీ 'కాటమరాయుడు' విడుదలకు ముస్తాబయ్యాడు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తో కాటమరాయుడు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మరోవైపు పవన్ తో మరో హిట్ కొట్టడం ఖాయమంటోంది శ్రుతిహాసన్. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కాటమరాయుడు’ సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ట్రైలర్.. అభిమానులకు తెగ నచ్చేసింది.

 

ఇక మ్యూజిక్ విషయంలో.. పవన్ ఇచ్చిన అవకాశాన్ని అనూప్ పక్కాగా సద్వినియోగం చేసుకున్నాడనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇటీవల శిల్పారామంలో జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తో 'కాటమరాయుడు'పై అంచనాలు రెట్టింపయ్యాయి. 'గబ్బర్ సింగ్' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన శ్రుతి హాసన్.. ఇప్పుడు 'కాటమరాయుడు'లో మరోసారి పవర్ స్టార్‌తో జోడీ కట్టింది. ఇక పవన్ కల్యాణ్ వల్లే తాను స్టార్‌గా మారానని.. ఇప్పుడు 'కాటమరాయుడు'లోనూ పవన్‌తో నటించడం పట్ల ఫుల్ ఖుషీగా ఉన్నానంటోంది శ్రుతి.

 

మరోవైపు.. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. పవర్ స్టార్ 'కాటమరాయుడు' విడుదలకు ముస్తాబయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి.. 'గబ్బర్ సింగ్' తో అలరించిన పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ జంట 'కాటమరాయుడు'తో ఎలా అలరించనున్నారో, అది ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా