
ఒకానొక సమయంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ చుట్టూ తెగ చక్కర్లు కొట్టేస్తూ సూపర్ బిజీ హీరోయిన్‌గా హంగామా చేసిన శ్రుతి హాసన్ ఉన్నట్లుండి డల్ అయిపోయింది. ఏ భాషలోనూ సరైన హిట్ లేక విలవిల్లాడిపోయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో 'శభాష్ నాయుడు' తప్ప మరో ప్రాజెక్ట్ ఏమీ లేదంటే శ్రుతి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కాటమ రాయుడు’ లో నటించింది శ్రుతి. తెలుగులో ఆ సినిమా తర్వాత మరే చిత్రంలోనూ నటించే అవకాశం ఆమెకు లభించలేదు. అంతేకాక ఆ సినిమాలో శ్రుతీ బాగా లావయ్యిందంటూ విమర్శలను కూడా ఎదుర్కొంది. అందుచేత టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రావడం లేదనే ప్రచారం కూడా జరిగింది. దీంతో తన మునుపటి ఫిట్ నెట్ కోసం వర్కౌట్స్ చేస్తోందట.
ఇదిలా ఉంటే..కొద్ది రోజులుగా శ్రుతికి కోలీవుడ్ లో నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలు వెలువడ్డాయి. దానిపై ఈ అమ్మడు వివరణ కూడా ఇచ్చింది. తాను ఏ కోలివుడ్ చిత్రం చేయడం లేదని చెప్పింది. అయితే.. త్వరలోనే ఈ అమ్మడు.. కోలీవుడ్ లో సినిమా చేస్తోందంటూ మళ్లీ ప్రచారం మొదలైంది. డైరెక్టర్ నంద కిశోర్, కన్నడ హీరో ధ్రువ్ సార్జా ఓ చిత్రం కోసం శ్రుతిని సంప్రదించారట. కథ నచ్చడంతో ఒకే చెప్పేసిందట. ప్రస్తుతం చేతిలో ఏ సినిమాలు లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాదనాలనే భావనతో ఈ సినిమాకి ఓకే చేసిందని సమాచారం.