‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై స్పందించిన పురందేశ్వరి

Published : Oct 09, 2017, 04:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై స్పందించిన పురందేశ్వరి

సారాంశం

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’కి దర్శకత్వం వహిస్తున్న ఆర్జీవీ నిర్మాతగా వ్యవహరిస్తున్న వైసీపీ నేత

లెజండరీ యాక్టర్.. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి కోణంలో ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

అయితే.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు, పలువురు అభిమానులు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా.. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత పురందేశ్వరి ఈ చిత్రంపై స్పందించారు. ఎన్టీఆర్ లాంటి మహానటుడి జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నప్పుడు ఆయన గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలన్నారు. కేవలం ఒక్కరి కోణంలో సినిమా తీయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

 

సినిమా తెరకెక్కించడానికి ముందే.. తమ కుటుంబ సభ్యులందరితో చర్చించాలని.. ఆ తర్వాత షూటింగ్ ప్రారంభించాలని పురందేశ్వరి ఆర్జీవీని కోరారు. ఈ సినిమాకి వైసీపీ నేత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్