రానాతో శృతిహాసన్.. ఏంటి సంగతి?

Published : Jun 27, 2019, 05:02 PM IST
రానాతో శృతిహాసన్.. ఏంటి సంగతి?

సారాంశం

క్రేజీ హీరో రానా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలిలో ప్రతినాయకుడిగా నటించినప్పటికీ రానాకు ప్రశంసలు దక్కాయి.

క్రేజీ హీరో రానా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలిలో ప్రతినాయకుడిగా నటించినప్పటికీ రానాకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం రానా భారీ చిత్రాల్లో నటించబోతున్నాడు. విరాటపర్వం, హిరణ్యకశ్యప లాంటి భారీ ప్రాజెక్ట్స్ రానా కోసం ఎదురుచూస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర కాంబినేషన్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

రానాతో శృతి హాసన్ క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో శృతి హాసన్, రానా ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. మరో సెల్ఫీలో శృతి హాసన్, రానాతో పాటు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి కూడా ఉండడం ఆసక్తిని రేపుతోంది. 

రాఘవేంద్ర రావు తనయుడిగా ప్రకాష్ దర్శకుడిగా పరిచయం అన్నారు. ప్రకాష్ తెరకెక్కించిన అనగనగా ఓ ధీరుడు చిత్రం ద్వారా శృతి హాసన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. దీనితో రానా, ప్రకాష్, శృతి హాసన్ కలయికపై ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆసక్తికర కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

కాసుల వర్షం కురిపిస్తున్న రాజా సాబ్, ప్రభాస్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
కెమెరాల ముందు ప్రియాంక, నిక్ రొమాన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో స్టార్ కపుల్ సందడి