కుర్ర దర్శకుడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్?

Published : Jun 27, 2019, 04:19 PM IST
కుర్ర దర్శకుడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్?

సారాంశం

సీనియర్ హీరోలు ఇప్పుడు రెగ్యులర్ ఫార్మాట్ ని కాస్త దూరం పెట్టి కొత్తగా ట్రై చేస్తున్నారు. నేటితరం కొత్త దర్శకులు ఎలాంటి కథ చెప్పడానికి వచ్చినా వినేందుకు సిద్దపడుతున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఓ యువ దర్శకుడిపై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.   

అతనెవరో కాదు అ! సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ కుర్రాడు త్వరలో నందమూరి బాలకృష్ణతో వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కుదిరితే బాలయ్యతో ఒక సినిమా చేస్తానని ఇదివరకే చెప్పిన ఈ కల్కి దర్శకుడు బాలకృష్ణ నుంచి రీసెంట్ గా పిలుపునందుకున్నట్లు టాక్. 

మంచి కథ ఉంటే రెడీ చేసుకొమ్మని సన్నిహితుల ద్వారా ప్రశాంత్ కి వార్త పంపినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ కల్కి రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సినిమా హడావుడి అంతా అయిపోయాక తన దగ్గర కొన్ని ఐడియాలను బాలకృష్ణతో షేర్ చేసుకొని ఆయనకు నచ్చితే ఆ తరువాత స్టోరీని డెవలప్ చేయాలనీ కుర్ర దర్శకుడు ఆలోచిస్తున్నాడట. ఒకవేళ ఈ కాంబినేషన్ తెరపైకి వస్తే బాలయ్య తెరపై సరికొత్తగా కనిపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.  

PREV
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?