సంగమిత్ర నుంచి తప్పుకున్న శృతీహాసన్

Published : May 29, 2017, 01:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
సంగమిత్ర నుంచి తప్పుకున్న శృతీహాసన్

సారాంశం

చారిత్రక చిత్రం సంఘమిత్రలో రాణి పాత్రలో శృతీహాసన్ లండన్ లో కత్తి సాము శిక్షణ తీసుకున్న శృతీ పూర్తి కథ,పక్కా డేట్స్ వివరాలు చెప్పకపోవడంతో తప్పుకున్న శృతి

శృతీ హాసన్ సంఘమిత్ర చిత్రం నుచి తప్పుకుందా.. అంటే అధికారికంగా శృతి తరపున ఆమె ప్రతినిథి అవుననే అంటున్నారు. సంఘమిత్ర చిత్రంలో తాను నటించడం కుదరకపోవడం బాధాకరమని, అయితే రెండేళ్ల పాటు సంఘమిత్రకు సమయం కేటాయించడమంటే.. సాధ్యమయ్యేలా లేదని శృతీ హాసన్ భావిస్తోందట. అసలు సంఘమిత్ర కోసం కత్తి సాము నేర్చుకునేందుకు శృతి లండన్ లో అనుభవజ్ఞుడైన శిక్షకున్ని కూడా ఎంచుకుని శిక్షణ తీసుకుంటోంది.

 

అయితే.. ఇంతలా తను సంఘమిత్ర కోసం కష్టపడుతుంటే.. ఈచిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు సరైన స్క్రిప్ట్ కానీ., డేట్ క్యాలెండర్ కానీ ఇవ్వకపోవడంతో సంఘమిత్ర నుంచి తప్పుకోవాల్సి వస్తోందట. ప్రస్థుతం శృతి హిందీ చిత్రం బెహెన్ హోగీ తెరీ ప్రమోషన్ తో పాటు, శభాష్ నాయుడు చిత్రానికి రెడీ అవుతోంది. దీంతోపాటు తన మ్యూజికల్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.

మరి ఇది అలకో లేక... మరేంటో తేలాలంటే కొంత కాలం వేచి చూడాలి. సంఘమిత్ర లాంటి కేన్స్ లో ప్రమోషన్ చేసిన సినిమాను శృతీ అంత ఈజీగా ఎలా వదిలేస్తుందన్నది ఆలోచించాల్సిన అంశం.

PREV
click me!

Recommended Stories

Thanuja : తనూజ పై మనసులో మాట బయటపెట్టిన కళ్యాణ్ పడాల , అవాక్కైన బిగ్ బాస్ 9 రన్నర్
30 కోట్లు బడ్జెట్, 50 కోట్లకు డీల్, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న డీమోంటె కాలనీ 3