అక్షయ్ కుమార్ తల్లి ఇక లేరు... భరించలేని బాధంటూ ఆయన ఎమోషనల్ పోస్ట్

Published : Sep 08, 2021, 10:33 AM ISTUpdated : Sep 08, 2021, 10:40 AM IST
అక్షయ్ కుమార్ తల్లి ఇక లేరు... భరించలేని బాధంటూ ఆయన ఎమోషనల్ పోస్ట్

సారాంశం

స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణ భాటియా తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అరుణ్ భాటియా  ముంబై లోని హిరానందాని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు.

బాలీవుడ్ లో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణ భాటియా తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అరుణ్ భాటియా  ముంబై లోని హిరానందాని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.ఆమె ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు స్పందించని అరుణ భాటియా బుధవారం మరణించడం జరిగింది.  

తల్లి మరణ వార్తను అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన భావోద్వేగ పూరిత సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ''ఆమె నా సర్వస్వం. నేడు నేను అంతర్లీనంగా భరించలేని బాధను అనుభవిస్తున్నారు. మా అమ్మ శ్రీమతి అరుణ భాటియా నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె వేరే ప్రపంచంలో మా తండ్రిగారిని కలవనున్నారు. ఈ కఠిన సమయంలో మా కుటుంబం కోసం మీరు చేసిన ప్రార్ధనలకు ధన్యవాదాలు. ఓం శాంతి..'' అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్  చేశారు. 

తల్లి అరుణ భాటియా అనారోగ్యం గురించి తెలుసుకున్న అక్షయ్ కుమార్ సోమవారం లండన్ నుండి ముంబై చేరుకున్నట్లు సమాచారం. ఆమె అనారోగ్యం నుండి కోలుకోవాలని అభిమానుల ప్రార్ధనలకు కృతజ్ఞతలు తెలుపుతూ అక్షయ్ మంగళవారం ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఇటీవల అక్షయ్ నటించిన బెల్ బాటమ్ విడుదల కాగా మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Suriya 46 Movie: సూర్య 46కి, గజినీకి సంబంధం ఏంటి? అంచనాలు పెంచేసిన నిర్మాత సమాధానం
2025 లో రియల్ లైఫ్ స్టోరీలతో వచ్చిన 6 సినిమాలు.. కొన్ని హిట్లు, కొన్ని వివాదాలు