చనిపోయిన తమ్ముడిని తలచుకొని కన్నీరు పెట్టుకున్న విశ్వ... అందుకే రవిని టాస్క్ లో బుక్ చేశాడట!

By team teluguFirst Published Sep 8, 2021, 9:01 AM IST
Highlights

విశ్వ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు, చివరకు తన తమ్ముడిని కోల్పోయినట్లు మొదటి ఎపిసోడ్ పరిచయ వీడియోలో తెలియజేసిన విషయం తెల్సిందే. కాగా నిన్న ఎపిసోడ్ లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 

నటుడు విశ్వ బిగ్ బాస్ సీజన్ 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కనిపిస్తున్నారు. విశ్వ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు, చివరకు తన తమ్ముడిని కోల్పోయినట్లు మొదటి ఎపిసోడ్ పరిచయ వీడియోలో తెలియజేసిన విషయం తెల్సిందే. కాగా నిన్న ఎపిసోడ్ లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సీ కోసం నిర్వహించిన టాస్క్ లో విశ్వ పవర్ రూమ్ యాక్సెస్ పొందారు. 


పవర్ రూమ్ యాక్సెస్ పొందిన విశ్వకు బిగ్ బాస్ ఓ ఆదేశం ఇచ్చారు. హౌస్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఎంచుకోవాలని, మీరు ఎంచుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ తమ ఒంటిపై ఉన్న బట్టలతో సహా, వారి సామాను మొత్తం స్టోర్ రూమ్ కి తరలించాలని చెప్పాడు. దీని కోసం విశ్వ యాంకర్ రవి, నటి ప్రియా లను ఎంచుకున్నారు. 


టాస్క్ లో భాగంగా రవి తన ఒంటిపై బట్టలు తొలగించి ఓ లేడీ నైట్ ధరించి, తన వస్తువులు మొత్తం స్టోర్ రూమ్ లో పెట్టారు. ఈ టాస్క్ కి రవిని ఎంచుకోవడానికి కారణం తెలుపుతూ విశ్వ ఎమోషనల్ అయ్యారు. రవి నన్ను అన్న అని పిలుస్తాడు. నేను ఇచ్చిన ఈ టాస్క్ రవి అంగీకరిస్తాడమే నేను అతన్ని ఎంచుకున్నాను, రవిని చూస్తే నాకు తమ్ముడు గుర్తుకు వస్తున్నాడని కన్నీరు పెట్టుకున్నారు. తనలో తమ్ముడిని చూసుకోవాలని రవి, విశ్వను ఓదార్చారు. 
 

click me!