యాంటీ కరప్షన్ ఆఫీసర్ గా చరణ్... లాంఛింగ్ పోస్టర్ తో ఫుల్ క్లారిటీ!

Published : Sep 08, 2021, 09:27 AM ISTUpdated : Sep 08, 2021, 09:34 AM IST
యాంటీ కరప్షన్ ఆఫీసర్ గా చరణ్... లాంఛింగ్ పోస్టర్ తో ఫుల్ క్లారిటీ!

సారాంశం

లాంఛింగ్ ప్రకటన పోస్టర్ విడుదల చేసిన ఆర్సీ 15 టీమ్, మూవీలో చరణ్ రోల్ పై ఓ హింట్ ఇచ్చారు. ఈ స్పెషల్ పోస్టర్ లో రామ్ చరణ్ సూటు, బూటు, గ్లాసెస్ ధరించి జెంటిల్ లుక్ లో కేక పుట్టించారు. 

దేశంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో జతకట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. భారీ పాన్ ఇండియా మూవీగా దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, దర్శకధీరుడు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి అతిథులుగా హాజరవుతున్నారు. 


మూవీ లాంఛింగ్ ప్రకటన పోస్టర్ విడుదల చేసిన ఆర్సీ 15 టీమ్, మూవీలో చరణ్ రోల్ పై ఓ హింట్ ఇచ్చారు. ఈ స్పెషల్ పోస్టర్ లో రామ్ చరణ్ సూటు, బూటు, గ్లాసెస్ ధరించి జెంటిల్ లుక్ లో కేక పుట్టించారు. ఆయన చేతిలో ఓ ఫైల్ ఉండడం మనం చూడవచ్చు. చరణ్ లుక్ ద్వారా ఆయన అవినీతి నిరోధక అధికారి రోల్ చేస్తున్నారని అర్థం అవుతుంది. 

నల్లధనం దండిగా సంపాదించే అక్రమార్కులపై దాడి చేసే సిన్సియర్ అవినీతి నిరోధక శాఖ అధికారిగా చరణ్ కనిపించే ఆస్కారం కలదు. అధికారికంగా ఎటువంటి సమాచారం లేకున్నా పోస్టర్ చూస్తే ఆ భావన కలుగుతుంది. సామాజిక సబ్జెక్టుకి కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించడంలో శంకర్ దిట్ట. ఆ ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ శంకర్ ప్రతి సినిమాలో సామాజిక కోణం ఉంటుంది.


తాజాగా చరణ్ తో ఆయన యాంటీ కరప్షన్ నేపథ్యంలో మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.  పోస్టర్ లో చరణ్ తో పాటు డైరెక్టర్ శంకర్, హీరోయిన్ కియారా, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. అలాగే కీలక రోల్స్ చేస్తున్న సునీల్, అంజలి, జయరామ్ లను కూడా పోస్టర్ లో చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. విశ్వంభర అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

PREV
click me!

Recommended Stories

Suriya 46 Movie: సూర్య 46కి, గజినీకి సంబంధం ఏంటి? అంచనాలు పెంచేసిన నిర్మాత సమాధానం
2025 లో రియల్ లైఫ్ స్టోరీలతో వచ్చిన 6 సినిమాలు.. కొన్ని హిట్లు, కొన్ని వివాదాలు