Bigg Boss Telugu 5: జెస్సీ తోక వంకర.. శ్రీరామ్‌ ఏం లేక ఎగిరెగిరి పడుతాడట.. లోబో దున్నపోతు మీద పడ్డ వానే..

By Aithagoni RajuFirst Published Oct 31, 2021, 12:30 AM IST
Highlights

మరోవైపు `వైకుంఠపాలి` ఆట తర్వాత `సామేతల` గేమ్‌ ఆడించారు. దీని ప్రకారం ఇంటి సభ్యుడికి ఓ సామెత ఉన్న ప్లేట్‌ని నాగార్జున కేటాయిస్తాడు. దాన్ని హౌజ్‌లో ఆ సామెత ఎవరికి సరిపోతుందో చెప్పాలి. 

బిగ్‌బాస్‌5(Bigg Boss Telugu 5) హౌజ్‌లో 56వ ఎపిసోడ్‌(55వ రోజు) నాగార్జున(Nagarjuna) ఇంటిసభ్యులతో వరుసగా గేమ్‌లు ఆడుకున్నారు. ఓ వైపు మొదటగా లెటర్స్ త్యాగం చేసిన వారిని ప్రశంసించారు. మరోవైపు హౌజ్‌లో ఈ వారం తేడా చేసిన వారికి వార్నింగ్‌లు ఇచ్చాడు. రవిని ఏకంగా హౌజ్‌ని నుంచి వెళ్లిపోమన్నాడు. సన్నీని ఎక్స్ ట్రాలు తగ్గించుకోమని చెప్పారు. మరోవైపు `వైకుంఠపాలి` ఆట తర్వాత `సామేతల` గేమ్‌ ఆడించారు. దీని ప్రకారం ఇంటి సభ్యుడికి ఓ సామెత ఉన్న ప్లేట్‌ని నాగార్జున కేటాయిస్తాడు. దాన్ని హౌజ్‌లో ఆ సామెత ఎవరికి సరిపోతుందో చెప్పాలి. 

ఇందులో భాగంగా మొదట సన్నీ నుంచి ప్రారంభించారు. ఆయనకు `కుక్కతోక వంకర` అనే సామెత ఇవ్వగా దాన్ని ఆయన జెస్సీపై వేశాడు. సంచాలకుడిగా ఎలా వ్యవహరించారు, బిగ్‌బాస్‌ ఇచ్చిన నిబంధనలు చదివి సరిగ్గా పాటించాల్సి ఉంటుంది. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఆయన చేయడం లేదని, ఆయనకు కుక్కతోక వంకర సామెత సెట్‌ అవుతుందన్నారు. ఆ తర్వాత మానస్‌ని పిలిచి ఆయనకు `అబద్దం ఆడినా అతికినట్టు ఉండాలి` అనే సామెత ఇవ్వగా, దాన్ని ఆయన రవికి ఇచ్చాడు.  దీంతో రవి ఏం చేస్తాడో అందరికి అర్థమైపోయింది. 

కాజల్‌కి `ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది` అనే సామెతని నాగ్‌ కేటాయించగా, దాన్ని ఆమె శ్రీరామ్‌పై వేస్తుంది. శ్రీరామ్‌ తనది చూసుకోకుండా పక్కవారిపై ఫోకస్‌ పెడతారని తెలిపింది. అనీ మాస్టర్‌కి `రాను రాజు రాజుగారి గుర్రం కాస్త ఇప్పుడు గాడిద అయ్యిందట` అని సామెత ఇవ్వగా ఆమె కాజల్‌కి ఇచ్చింది. మొదట్లో ఉన్న ఫైర్‌ ఇప్పుడు కనిపించడం లేదని తెలిపింది. శ్రీరామ్‌కి `అరిటాకు కానిది అర్థషేర్‌ మసాలాకి అయ్యిందట` అనే సామెతని ఇవ్వగా, ఆయన కాజల్‌కి ఇచ్చాడు. విశ్వకి `దున్నపోతు మీద వాన కురిసినట్టు` సామెత ఇవ్వగా, లోబోకి ఇచ్చేశాడు. 

జెస్సీకి `పైన పటారం.. లోన లొటారం` సామెతని సన్నీకి ఇచ్చాడు. పైకి వాగుతాడు కానీ ఏం చేయలేడని తెలిపాడు. సిరికి `అందని ద్రాక్ష పుల్లన` అనే సామెత ఇవ్వగా అది ఆమె షణ్ముఖ్‌కి ఇచ్చింది. కెప్టెన్‌ షణ్ముఖ్‌కి `ఏకై వచ్చి మేకై తగులుకున్నావు` అనే సామెతని ఇవ్వగా, అది రవికి ఇచ్చాడు. రవికి.. `ఓడ ఎక్కినప్పుడు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న` సామెత ఇవ్వగా, దాన్ని ఆయన మానస్‌కి ఇచ్చాడు. లోబోకి `చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం` అనే సామెత ఇవ్వగా, దాన్ని అనీ మాస్టర్ కి ఇచ్చాడు. 

related news: Bigg Boss Telugu 5: రవికి ఊహించని షాకిచ్చిన నాగార్జున.. హౌజ్‌ నుంచి వెళ్లిపొమ్మంటూ వార్నింగ్‌.. సన్నీపై ఫైర్‌

శనివారం నామినేషన్ల జోలికి వెళ్లలేదు. రేపు(ఆదివారం) దీపావళి స్పెషల్‌ ఈవెంట్‌ ఉంది. ఇందులో నామినేషన్‌లో ఉన్న సిరి, శ్రీరామ్‌, లోబో, షణ్ముఖ్‌, మానస్‌, రవిలలో ఒకరిని ఎలిమినేట్‌ చేయబోతున్నారు. అయితే స్పెషల్‌ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ,ఆనంద్‌ దేవరకొండ, శ్రియా వంటి తారలు మెరవబోతుండటం విశేషం. రేపటి ఈవెంట్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీపావళి సంబరాలు తెచ్చేలా ఉండబోతుందనిపిస్తుంది.

also read: Bigg Boss Telugu 5: హౌజ్‌లో కాజల్‌ `నాగిని` అంటూ ఇంటి సభ్యుల తీర్మానం.. నాగార్జున అంత మాట అనేశాడేంటి?

click me!