Bigg Boss Telugu 5: హౌజ్‌లో కాజల్‌ `నాగిని` అంటూ ఇంటి సభ్యుల తీర్మానం.. నాగార్జున అంత మాట అనేశాడేంటి?

Published : Oct 31, 2021, 12:18 AM IST
Bigg Boss Telugu 5:  హౌజ్‌లో కాజల్‌ `నాగిని` అంటూ ఇంటి సభ్యుల తీర్మానం.. నాగార్జున అంత మాట అనేశాడేంటి?

సారాంశం

కాజల్‌ మొదటగా చెబుతూ, మానస్‌ సపోర్ట్ చేస్తాడని, తనకు నిచ్చెన అని చెప్పింది. శ్రీరామ్‌ పాము లాంటివాడని, రెచ్చగొడుతుంటాడని తెలిపింది. రవి చెబుతూ, నిచ్చెన షణ్ముఖ్‌ అని, ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయన్నారు. కాజల్‌ పాము అని చెప్పాడు.  

బిగ్‌బాస్‌ 5(Bigg Boss Telugu 5).. 55వ రోజు గేమ్‌లతో ఎంటర్‌టైన్ చేయించాడు నాగ్‌(Nagarjuna). అందులో ప్రధానంగా `వైకుంఠపాలి` ఆడిపించారు. ఇందులో సభ్యులు తమకి నిచ్చెనగా ఉండేది ఎవరు, స్నేక్‌లా కాటేసేది ఎవరనేది చెప్పాలి. అందులో భాగంగా కాజల్‌ మొదటగా చెబుతూ, మానస్‌ సపోర్ట్ చేస్తాడని, తనకు నిచ్చెన అని చెప్పింది. శ్రీరామ్‌ పాము లాంటివాడని, రెచ్చగొడుతుంటాడని తెలిపింది. రవి చెబుతూ, నిచ్చెన షణ్ముఖ్‌ అని, ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయన్నారు. కాజల్‌ పాము అని చెప్పాడు.  జెస్సీ చెబుతూ, విశ్వ నిచ్చెన అని, సన్నీ పాము అని తెలిపాడు. 

ప్రియాంక విషయంలో తనకు మానస్‌ నిచ్చెనలాంటి వాడని, లోబో పాములాంటి వాడన్నారు. ఆయన చేసేవి కామెడీగా ఉన్నా, నచ్చవని తెలిపింది. సన్నీ చెబుతూ, మానస్‌ నిచ్చెన అని, తనకు మంచి ఫ్రెండ్‌గా మారడాని తెలిపాడు. షణ్ముఖ్‌ పాము అని, ఆయన ప్రవర్తన అలా ఉంటుందని, ఎప్పుడు ఎలా బిహేవ్‌ చేస్తాడో అర్థం కాడని చెప్పాడు. విశ్వ చెబుతూ తనకు లోబో మంచి స్నేహితుడని, నిచ్చెలా నిలబడతాడని తెలిపారు. కాజల్ స్నేక్‌ అని, కాలు పట్టి లాగేలా ఉంటుందన్నారు. 

లోబోకి నిచ్చెన లాంటి వాడు రవి అని, సన్నీ స్నేక్‌ అని తెలిపారు. శ్రీరామ్‌ తనకు అనీ మాస్టర్‌ నిచ్చెన అని, కాజల్‌ స్నేక్‌ అన్నారు. అనీ మాస్టర్‌ చెబుతూ, రవి ల్యాడర్‌ అని, కాజల్‌ స్నేక్‌ అని తెలిపారు. మానస్‌కి ల్యాడర్‌ సన్నీ అని, రవి పాములాంటివాడన్నారు. హౌజ్‌లో తనకు ఆర్గానిక్‌గా మంచి ఫ్రెండ్‌గా సన్నీ మారాడని తెలిపాడు మానస్‌. షణ్ముఖ్‌ చెబుతూ, తనకు సిరి ల్యాడర్ అని, రవి పాము అని తెలిపారు. ఈ విషయంలో నాగ్‌ స్పందిస్తూ, బ్రహ్మ మైండ్‌నే చదివేస్తున్నావా? రవి అంటూ పంచ్‌లు వేశాడు. 

సిరి చెబుతూ.. షణ్ముఖ్‌ ల్యాడర్‌ అని, తనకు చాలా సపోర్టింగ్‌గా, అండగా నిలుస్తాడని చెప్పింది. సన్నీ స్నేక్‌ అని తెలిపింది. ఈ గేమ్‌లో ఎక్కువగా కాజల్‌కి స్నేక్‌ అంటూ ఓట్లు పడ్డాయి. ఆమెని నలుగురు పాముగా వర్ణించారు. ఆ తర్వాత సన్నీకి మూడు ఓట్లు పడ్డాయి. మొత్తంగా హౌజ్‌లో నాగినిగా కాజల్‌ నిలిచింది. చిన్న పాముగా సన్నీ పేరుతెచ్చుకున్నారు. 

also read: Bigg Boss Telugu 5: రవికి ఊహించని షాకిచ్చిన నాగార్జున.. హౌజ్‌ నుంచి వెళ్లిపొమ్మంటూ వార్నింగ్‌.. సన్నీపై ఫైర్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

అమెరికాలో బాలకృష్ణ అరుదైన రికార్డు, వరుసగా ఐదోసారి చరిత్ర సృష్టించిన బాలయ్య బాబు..
40 కోట్ల బంపరాఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా? పిల్లలకు చెడ్డ పేరు వస్తుందని ఆలోచించిన నటుడు