బ్రేకింగ్ న్యూస్.. మా ఎలక్షన్స్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బండ్ల గణేష్, కారణం వాళ్ళ ఒత్తిడేనా?

Published : Oct 01, 2021, 02:45 PM IST
బ్రేకింగ్ న్యూస్.. మా ఎలక్షన్స్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బండ్ల గణేష్, కారణం వాళ్ళ ఒత్తిడేనా?

సారాంశం

నేను ఖచ్చితంగా గెలవబోతున్నాని బీరాలు పలికిన బండ్ల గణేష్(Bandla Ganesh), ఎన్నికల ముందు ఉసూరుమనిపించారు. ఆయన తన నామినేషన్ ఉపసమరించుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తన నామినేషన్ క్యాన్సిల్ చేయాలని, మా ఎన్నికల(MAA elections) అధికారికి లిఖితపూర్వకంగా తెలియజేశారు.

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఏది చేసినా సంచలనమే.  నాకు పెద్దవారి అండ ఉంది,నేను ఖచ్చితంగా గెలవబోతున్నాని బీరాలు పలికిన బండ్ల గణేష్, ఎన్నికల ముందు ఉసూరుమనిపించారు. ఆయన తన నామినేషన్ ఉపసమరించుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తన నామినేషన్ క్యాన్సిల్ చేయాలని, మా ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. 


''నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను'' అంటూ ట్వీట్ చేసిన బండ్ల గణేష్, తన ఉపసంహరణ లేఖ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. మొదట్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి అనుకూలంగా మాట్లాడిన బండ్ల గణేష్, జీవితా రాజశేఖర్ ఎంట్రీతో ప్లేటు ఫిరాయించాడు. 

జీవితా రాజశేఖర్ అంటే తనకు గిట్టదు అంటూ... జనరల్ సెక్రెటరీ పదవికి ఇండిపెండెంట్ గా ఆమెపై పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రెస్ మీట్ లో తాను ఖచ్చితంగా గెలవబోతున్నట్లు, తనకు ఈశ్వరుడి అండ ఉందని  అన్నారు. ఇక బండ్ల గణేష్ ఈ నిర్ణయం వెనుక మెగా ఫ్యామిలీ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి బహిరంగంగా మద్దతు ప్రకటించిన పవన్, నాగబాబు లాంటి వారు, బండ్ల గణేష్ చేత నామినేషన్ ఉపసంహరింప చేశారని ప్రచారం నడుస్తుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు