అమితాబచ్చన్ అరెస్ట్.. అభిమానులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బీ..

Published : May 19, 2023, 03:40 PM IST
అమితాబచ్చన్ అరెస్ట్..  అభిమానులకు  బిగ్ ట్విస్ట్ ఇచ్చిన  బిగ్ బీ..

సారాంశం

అమితాబచ్చన్  అరెస్ట్ అయ్యారు. అవును అమితాబ్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అంతే కాదు చివర్లో ఓ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇంతకీ ఏమయ్యిందంటే..? 

రీసెంట్ గా హెల్మెంట్ వివాదంలో చిక్కుకున్నారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్. ముంబై లో షూటింగ్‌కు లేటు అవుతుండటంతో.. ఓ అపరిచితుడినిలిఫ్ట్ అడిగి..ట్రాఫిక్ నుంచి బయటకపడ్డారు బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌  అయితే ఆ అపరిచిత వ్యక్తి  బైక్‌పై ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో.. అది కాస్తా పెద్దవివాదంగా మారింది. ఈ ప్రయాణంలో బిగ్‌బీ, లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తి ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకోలేదు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

అయితే  ఈ విషయంలో నెటిజన్ల నుంచి  బిగ్‌బీ విమర్శలు కూడా పేస్ చేశారు. సెలబ్రిలీలకు  ట్రాఫిక్‌ రూల్స్‌  ఉండవా అంటూఫైర్ అయ్యారు చర్యలు కూడా తీసుకోవాలి అని డిమాండ్ చేయడంతో.. పోలీసులు స్సందించి..సున్నితంగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు.. 10 వేలు జరిమాన కూడా వేశారు. అయితే ఈ ఫైన్ మాత్రం బిగ్‌బీకి  లిఫ్ట్‌ ఇచ్చిన పాపానికి.. ఆ వ్యక్తికి పోలీసులు ఫైన్‌ వేశారు.

ఇదిలా ఉండగా.. అమితాబ్‌ మరోసారి ఈ విషయంపై స్పందిచారు. అంతే కాదుషాకింగ్ విషయాన్ని శేర్ చేశారు బిగ్ బీ.  ఓ పోలీసు వాహనం పక్కన దీనంగా నిల్చుని ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోకు అరెస్టెడ్‌.. అంటూ క్యాప్షన్‌ ఇచ్చి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే ఇది నిజం అనుకున్నఫ్యాన్స్ కు.. సరదాగా ఇలా చేసినట్టు.. ఆటపట్టించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్ మీడియాలో  వైరల్‌ అవుతోంది. 

 

ఇర ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మీరు నిజంగా అరెస్ట్‌ అయ్యారా.., బిగ్‌ బీ జోక్‌ చేస్తున్నారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫోటో షూటింగ్ లో బాగంగా తీసిందని తెలుస్తోంది. ఓ మూవీ షూట్ లో.. పోలీస్ వెహికిల్ పక్కన నించుని.. ఇలాకావాలని బిగ్ బీ  ఫన్నీగా చేసి ఉంటారని అనుకుంటున్నారంతా. 

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌