`భీమ్లా నాయక్‌` సెకండ్‌ సింగిల్‌ ప్రోమో లోడింగ్‌.. పవన్‌ కళ్యాణ్‌, నిత్యాలపై లవ్‌ సాంగ్‌..

Published : Oct 13, 2021, 07:38 PM ISTUpdated : Oct 13, 2021, 07:52 PM IST
`భీమ్లా నాయక్‌` సెకండ్‌ సింగిల్‌ ప్రోమో లోడింగ్‌.. పవన్‌ కళ్యాణ్‌, నిత్యాలపై లవ్‌ సాంగ్‌..

సారాంశం

`అంతా ఇష్టం` అనే లిరికల్‌తో సాగే సెకండ్‌ సింగిల్‌ ప్రోమోని గురువారం 11గంటలకు విడుదల చేయబోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌, నిత్యా మీనన్‌ లపై ఈ పాట సాగబోతుంది. లవ్‌ సాంగ్‌గా ఇది ఉండబోతుందని అర్థమవుతుంది.   

పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తున్న `భీమ్లా నాయక్‌` నుంచి మరో ట్రీట్‌ రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్‌ సింగిల్‌( రెండో పాట)ని విడుదల చేయబోతున్నారు. దసరా కానుకగా ఈ నెల 14న(గురువారం) ఈ చిత్రంలోని రెండో పాటని విడుదల చేయబోతున్నారు. `అంతా ఇష్టం` అనే లిరికల్‌తో సాగే సెకండ్‌ సింగిల్‌ ప్రోమోని గురువారం 11గంటలకు విడుదల చేయబోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌, నిత్యా మీనన్‌ లపై ఈ పాట సాగబోతుంది. లవ్‌ సాంగ్‌గా ఇది ఉండబోతుందని అర్థమవుతుంది. 

also read:మరో అమ్మాయితో `జబర్దస్త్` వర్షకి అడ్డంగా దొరికిపోయిన ఇమ్మాన్యుయెల్‌.. రోజా ముందుకు పంచాయితీ.. వార్నింగ్‌

ఇక పవన్‌ కళ్యాణ్‌, రానా హీరోలుగా నటిస్తున్న `భీమ్లా నాయక్‌`లో నిత్యా మీనన్‌.. పవన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. సంయుక్త మీనన్‌ రానా సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో  ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైలాగులు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. 

మలయాళంలో రూపొందిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్‌ పాత్ర గ్లింప్స్, రానా పాత్ర గ్లింప్స్ విడుదల చేయగా వాటికి మంచి స్పందన లభించింది. మిలియన్స్ వ్యూస్‌తో రికార్డులు సృష్టించాయి. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నారు. మరోవైపు రానా డేనియల్‌ శేఖర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈగోలు దెబ్బతిన్న ఇద్దరు బలమైన వ్యక్తుల మధ జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. 

పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ తర్వాత ఇటీవల `వకీల్‌సాబ్‌`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. దీంతో తాజాగా ఆయన నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా టీజర్లు, గ్లింప్స్ లు, టైటిల్‌ సాంగ్‌ జనాల్లోకి బాగా వెళ్లాయి. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

also read: జాన్వీ కపూర్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా.. చీకటి గదిలో చీర జారిపోతుండగా మైండ్‌ బ్లోయింగ్‌ పోజులు..జస్ట్ కిల్లింగ్‌
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌