సురేష్‌ ప్రొడక్షన్‌ నుంచి వస్తోన్న శివానీ రాజశేఖర్‌ సినిమా

Published : Aug 25, 2021, 12:23 PM IST
సురేష్‌ ప్రొడక్షన్‌ నుంచి వస్తోన్న శివానీ రాజశేఖర్‌ సినిమా

సారాంశం

శివానీ ప్రస్తుతం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` చిత్రంలో నటిస్తుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి, రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. దీన్ని సురేష్‌ ప్రొడక్షన్‌ భాగస్వామ్యంతో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు. 

హీరో రాజశేఖర్‌ తనయ శివానీ నటించిన సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతుంది. ఆమె నటించిన తొలి చిత్రం ఆగిపోయింది. ఈక్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కే వీ గుహన్‌ దర్శకత్వంలో `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` చిత్రంలో నటిస్తుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి, రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. దీన్ని సురేష్‌ ప్రొడక్షన్‌ భాగస్వామ్యంతో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు. 

అరుణ్‌ ఆదిత్‌, శివానీ జంటగా నటిస్తున్నారు. సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకుని సినిమాపై అంచనాల్ని భారీగా పెంచాయి.  ఈ సంద‌ర్భంగా నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ, `రీసెంట్ గా  సినిమా చూశా. క్రిస్పీ న‌రేష‌న్‌తో  మంచి పెర్‌ఫామెన్స్‌ల‌తో చాలా థ్రిల్లింగ్ గా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్ని, ఈ క‌రోనా వ‌ల్ల వర్చువల్ వరల్డ్ లో వ‌చ్చిన మార్పుల‌ని చ‌క్క‌గా చూపించారు. అంత‌ర్లీనంగా  ఒక మంచి ప్రేమ‌క‌థ కూడా ఉంది.

ఆడియోకి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది` అని అన్నారు.  చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ, `మా బ్యానర్‌లో రూపొందిన ఫ‌స్ట్ మూవీ  `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`కి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా సంతోషంగా ఉంది. సురేష్ బాబుగారికి మా బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్‌ మూవీ ఇది. గుహ‌న్‌గారి మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. అలాగే  అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్ద‌రు సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చారు. వారిద్ద‌రి కెమిస్ట్రి త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. త్వ‌రలో ట్రైల‌ర్ రిలీజ్ చేయనున్నాం. క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది` అని చెప్పారు. ద‌ర్శ‌కుడు కేవీ గుహన్ మాట్లాడుతూ, `సినిమా చాలా బాగా వ‌చ్చింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ విడుద‌ల‌వ‌డం నిజంగా హ్యాపీగా ఉంది. అదిత్‌, శివాణి ఇద్ద‌రు చాలా బాగా న‌టించారు. టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి స‌పొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది` అని చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌