ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాంః షాకిచ్చిన ప్రకాష్‌ రాజ్‌

Published : Aug 25, 2021, 07:46 AM IST
ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాంః షాకిచ్చిన ప్రకాష్‌ రాజ్‌

సారాంశం

ప్రకాష్‌ రాజ్‌కి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆయనకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా నటుడు వెల్లడించడం షాక్‌కి గురి చేస్తుంది. అయితే అందులోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ప్రకాష్‌ రాజ్‌.

విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా నటుడు వెల్లడించడం షాక్‌కి గురి చేస్తుంది. అయితే అందులోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ప్రకాష్‌ రాజ్‌. తాను చేసుకుంది ఉత్తిత్తి పెళ్లి అని తేల్చేశాడు. తన కుమారుడి కోసం తాను మళ్లీ పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. 

తన కుమారుడు వేదాంత్‌ కోరిక మేరకు ఇలా చేసినట్టు ప్రకాష్‌ రాజ్‌ తెలిపారు. ఆయన తన రెండో భార్య పోనీ వర్మ, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు. `మా వివాహానికి సాక్షింగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం` అని ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశాడు. కొడుకు కోసం ప్రకాష్‌ చేసిన సరదా పనికి నెటిజన్లు కొందరు అభినందిస్తుంటే, మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. 

ప్రకాష్‌ రాజ్‌ 1994లో నటి లలిత కుమారిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు జన్మించారు. కుమారుడు 2004లో చనిపోయాడు. ఆ తర్వాత మొదటి భార్యకి విడాకులిచ్చి 2010లో ఆయన కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు వేదాంత్‌ జన్మించాడు. ఇక ప్రస్తుతం ప్రకాష్‌ రాజ్‌ హిందీతోపాటు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటిస్తూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

మరోవైపు ఇటీవల `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలకు సంబంధించి మరోసారి హైలైట్‌ అయ్యారు ప్రకాష్‌ రాజ్‌. ఆయన అధ్యక్ష బరిలో నిల్చున్నారు. దీనిపై తరచూ ట్వీట్లు చేస్తూ `మా` ఎన్నికల వేడిని రగిలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటుడిగా `ఎకేజీఎఫ్‌2`, `పుష్ప`, `అన్నాత్తే` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు ఇటీవల ధనుష్‌ సినిమా షూటింగ్‌లో భుజానికి గాయమైంది. సర్జరీ చేయించుకున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు