శిల్పా శెట్టికి హాలీవుడ్ నటుడు బలవంతంగా ముద్దులు.. ఎయిడ్స్ ఈవెంట్ లో అలా, కోర్టులో తేలింది ఇదీ..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 26, 2022, 02:35 PM IST
శిల్పా శెట్టికి హాలీవుడ్ నటుడు బలవంతంగా ముద్దులు.. ఎయిడ్స్ ఈవెంట్ లో అలా, కోర్టులో తేలింది ఇదీ..

సారాంశం

పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి తన ప్రమేయం లేకున్నా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. మొన్నటివరకు ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ వివాదం సంచలనం సృష్టించింది. 

పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి తన ప్రమేయం లేకున్నా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. మొన్నటివరకు ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ వివాదం సంచలనం సృష్టించింది. పోర్న్ చిత్రాలని నిర్మిస్తున్నారనే ఆరోపణలతో ఆ మధ్యన రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారం శిల్పాశెట్టికి కూడా పెద్ద తలనొప్పిలా మారింది. 

ఇదిలా ఉండగా తాజాగా మరో కేసు నుంచి శిల్పా శెట్టికి ఊరట లభించింది. ఈ కేసు దాదాపు 14 ఏళ్ల క్రితం నాటిది. 2007లో రాజస్థాన్ లో జరిగిన ఎయిడ్స్ ఈవెంట్ కు శిల్పా శెట్టి, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ అతిథులుగా హాజరయ్యారు. ఎయిడ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో శిల్పా శెట్టి అందానికి రిచర్డ్ గేర్ ముగ్ధుడయ్యాడు. 

దీనితో వేదికపైనే శిల్పా శెట్టిని తన కౌగిలిలో బంధించి ముద్దుల వర్షం కురిపించాడు. అప్పట్లో ఆ ముద్దుల వ్యవహారం పెను దుమారం రేపింది. బహిరంగంగా అసభ్యంగా ముద్దులు అంటూ శిల్పా శెట్టిపై, రిచర్డ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ శిల్పా శెట్టిపై కేసు ఎందుకు అనే అనుమానం రావచ్చు. 

రిచర్డ్ గేర్ బలవంతమా ముద్దులు పెడుతున్నప్పటికీ శిల్పా శెట్టి ఏమాత్రం ప్రతిఘటించలేదు అనేది ఆరోపణ. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది. శిల్పా శెట్టి ఈ కేసులో బాధితురాలు అని తీర్పు ఇస్తూ ఆమెపై ఉన్న ఆరోపణలని కొట్టివేసింది. రిచర్డ్ అనుచిత ప్రవర్తనని వ్యతిరేకించకుండా బహిరంగ ముద్దులకు సహకరించిందనేది చాలా మంది ఆరోపణ. ఏది ఏమైనా శిల్పా శెట్టి ఈ కేసులో ఊరట లభించింది. 

శిల్పా శెట్టి వయసు ప్రస్తుతం 46 ఏళ్ళు. ఈ వయసులో కూడా శిల్పా శెట్టి అందం చూస్తే మతి పోవలసిందే. నాజూకైన అందాలతో శిల్పా శెట్టి కుర్ర భామలకు ధీటుగా నిలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..