
బాలీవుడ్ మెగాస్టార్ Amitabh Bachchan కి ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అందుకే ఇప్పటికీ ఆయన నటిస్తున్న సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఆయన అభిమానులు. అంతేకాకుండా social miediaలో సైతం ఎంతో యాక్టివ్గా ఉంటూ వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటాడు ఈ super star.
తాజాగా Republic Day 2022 సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందులో అమితాబ్ గడ్డానికి మన దేశ జాతీయ పతాకంలో ఉన్నట్టు మూడు రంగులుఉన్నాయి. అంతేకాకుండా ‘ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు.
ఎంతో వినూత్నంగా ఉన్న ఈ అమితాబ్ పిక్ నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటుంది. దీంతో వరుస కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్. కొందరు సెలబ్రిటీలు సైతం ఆయన పోస్ట్ పై స్పందించారు. అందులో.. ‘ సార్.. శుభాకాంక్షలు ఎంతో బాగా చెప్పారు.. హ్యాపీ గణతంత్ర దినోత్సవం’ అంటూ ఆయన ఫోటోపై కామెంట్ పెట్టింది నటి దివ్య దత్తా.