RGV: మరోసారి గొంతు సవరించిన రామ్ గోపాల్ వర్మ.. కొండా మూవీ నుంచి ట్రైలర్ ట్రీట్

Published : Jan 26, 2022, 12:29 PM IST
RGV: మరోసారి గొంతు సవరించిన రామ్ గోపాల్ వర్మ.. కొండా మూవీ నుంచి ట్రైలర్ ట్రీట్

సారాంశం

సంచలన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ). మరోసారి మరో సంచలనం సృష్టించబోతున్నాడు. ఎన్నో పొలిటికల్ కాంట్రవర్సీల మధ్య కొండ ట్రైలర్ ను రిలీజ్ చేశారు వర్మ.

సంచలన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ). మరోసారి మరో సంచలనం సృష్టించబోతున్నాడు. ఎన్నో పొలిటికల్ కాంట్రవర్సీల మధ్య కొండ ట్రైలర్ ను రిలీజ్ చేశారు వర్మ.

వివాదాస్పద బయోపిక్ మూవీస్ తీయ్యడంతో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )కు ఎవరూ సాటి రారు. ఎవరికి భయపడకుండా.. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా తనకు అనకున్నది అనుకున్నట్టు తీస్తుంటాడు వర్మ.  ఈ క్రమలోనే వరంగల్ కు చెందిన సీనియర్ పొలిటికల్  దంపతులు  కొండా మురళీ - కొండా సురేఖ జీవితంలోని కొన్ని కొన్ని సంఘటనల ఆధారంగా కొండా(Konda) సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. 

ఇక తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా  కొండా(Konda)  సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఆర్జీవీ(Ram Gopal Varma ). ఈ ట్రైలర్  తో మరోసారి తన గొంతును సవరించారు. సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు బాగుచేయాలి అంటూ వర్మ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. నీకు పోయేటందుకు ఏమీ లేవు బానిస సంకెళ్లు తప్ప.. విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైలింజన్.. పేతందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి..  వాటిపై పోరాడటానికి .. ఇలాంటి  విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టిన వాడే కొండా మురళి అంటూ ట్రైలర్ లో వర్మ(Ram Gopal Varma ) వివరించారు.

 

ఈ ట్రైలర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఎన్నో ప్రెజర్స్ తో పాటు భారీ అంచనాల మధ్య కొండ(Konda)  మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు వర్మ. ఇక  కొండా(Konda)  దంపతులకు వరంగల్ పరిధిలో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ మూవీ గురించి అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి తెలిసిపోయింది. ఆ తర్వాత వరంగల్ లో  కొండా మూవీ ప్రమోషన్ లో భాగంగా  వ్రాప్ అప్ పార్టీ కూడా చేశారు టీమ్. అన్నల డ్రెస్ లో ఆర్జీవి(Ram Gopal Varma ) వరంగల్ లో సందడి చేశారు కూడా. అంతే కాదు ఈ సినిమా గురించి వర్మ స్వయంగా పాడిన పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

ఇక ఈ ట్రైలర్ తో కొండా(Konda)   సినిమా పై అంచనాలు పెరిగాయి. అసలు ఈ  సినిమాను  రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )  తెరకెక్కిస్తున్నారనగానే అందరి దృష్టి అటువైపు వెళ్ళింది. మల్లారెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమా విషయంలో  కొండా దంపతులు  ఒప్పుకోరనే రూమర్లు అప్పట్లో నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కొండా దంపతులకు నచ్చజెప్పి, స్టోరీ లైన్ తో మెప్పించి కన్విన్స్ చేసినట్టు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు