గత కొన్ని రోజులు సవాళ్లతో సాగింది..తప్పుడు ప్రచారాన్ని ఆపండిః శిల్పాశెట్టి సంచలన నోట్‌

Published : Aug 02, 2021, 01:36 PM ISTUpdated : Aug 02, 2021, 01:40 PM IST
గత కొన్ని రోజులు సవాళ్లతో సాగింది..తప్పుడు ప్రచారాన్ని ఆపండిః  శిల్పాశెట్టి సంచలన నోట్‌

సారాంశం

భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో శిల్పాశెట్టి తాజాగా ఓ సంచలన, ఎమోషనల్‌ నోట్‌ని పంచుకుంది.

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి తనపై వస్తోన్న నెగటివ్‌ కామెంట్లపై స్పందించింది. గత కొన్ని రోజులుగా తమకి ఛాలెంజింగ్‌గా సాగిందని, ఇకపై తప్పుడు ప్రచారాన్ని, నెగిటివ్‌ కామెంట్లు ఆపండని పేర్కొంది. ఈ మేరకు సోమవారం సోషల్‌ మీడియా ద్వారా ఓ సంచలన నోట్‌ని పంచుకుంది శిల్పాశెట్టి. ఇందులో ఆమె చెబుతూ, `అవును.. గత కొన్ని రోజులు సవాళ్లతో సాగింది. చాలా పుకార్లు, ఆరోపణలు వచ్చాయి. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై అవాంఛనీయ కామెంట్లు చేశారు. ఆరోపణలు చేస్తున్నారు. నాకు మాత్రమే కాకుండా నా కుటుంబానికి కూడా ట్రోల్స్, అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

అయినా నేను ఇంకా ఎలాంటి కామెంట్‌ చేయలేదు. నేను నాస్టాండ్‌ మీద ఉన్నాను. ఈ కేసు విషయంలో నేను స్పందించలేను. ఇది పక్షపాతం. దయజేసి తప్పుడు ప్రచారాన్ని ఆపాదించడం ఆపివేయండని నా తరఫున కోరుతున్నా. సెలబ్రిటీగా `ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు, వివరించవద్దు` అనే నా తత్వాన్ని పురుద్ఘాటిస్తున్నా. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులపై, భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఓ ఫ్యామిలీగా మేం అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను ఆశ్రయిస్తున్నాం. కానీ అప్పటి వరకు నేను వినయంగా అడుగుతున్నా. ముఖ్యంగా ఓ తల్లిగా, నా పిల్లల కోసం మా గోప్యతని గౌరవించమని, నిజనిజాలేంటో  ధృవీకరించకుండా, సగం సగం సమాచారంపై వ్యాఖ్యానించడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. 
 
ఓ భారతీయ పౌరురాలిగా మన చట్టంపై నాకు గౌరవం ఉంది. నేను ఈ రంగంలో 29ఏళ్లుగా ఉన్నాను. కష్టపడి ఈ స్థాయికి వచ్చా. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. నేను ఎవరినీ నిరాశపర్చలేదు. కాబట్టి ఈ కాలంలో నాకుటుంబం, గోప్యతపై నా హక్కుని గౌరవించాలని కోరుతున్నా. మేం మీడియా విచారణకు అర్హులం కాదు. దయజేసి చట్టం దాని గమనాన్ని అనుమతించండి.సత్యమేవ జయతే ` అని ఎమోషనల్‌ నోట్‌ పంచుకుంది శిల్పాశెట్టి. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్