`పుష్ప` ఫస్ట్ సింగిల్‌.. ఫైవ్‌ లాంగ్వేజెస్‌, ఫైవ్‌ సింగర్స్ .. `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టయిల్‌

By Aithagoni RajuFirst Published Aug 2, 2021, 1:02 PM IST
Highlights

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `పుష్ప` చిత్రంలోని తొలి సాంగ్‌ రాబోతుంది. ఈ నెల 13న ఈ పాటని విడుదల చేయబోతున్నారు. ఈ విషయంలో `ఆర్‌ఆర్‌ఆర్‌`స్టయిల్‌ని ఫాలో అవుతున్నారు.

`పుష్ప` సినిమా కూడా `ఆర్ఆర్‌ఆర్‌` స్టయిల్‌ని ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప` చిత్ర ప్రమోషన్‌ షురూ అయ్యింది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఫస్ట్ సాంగ్‌ని ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్ తో పాడించబోతున్నారు. ఈ పాట రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు. సినిమా విడుదల చేయాలనుకున్న డేట్‌కే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని దోస్తీ పాటని కూడా ఇదే తరహాలో ఐదు భాషల్లో, ఐదు లాంగ్వేజెస్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.

`పుష్ప` చిత్రంలోని `దాక్కో దాక్కో మేక.. ` అంటూ సాగే పాటని ఈ నెల(ఆగస్ట్) 13న విడుదల చేయబోతున్నారు. నిజానికి కరోనా ముందు ఈ సినిమాని ఆగస్ల్ 13న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. నేడు దేవిశ్రీ ప్రసాద్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. తెలుగు వర్షన్‌ సాంగ్‌ని శివం పాడుతుండగా, హిందీ వర్షన్‌ విశాల్‌ దద్లానీ, తమిళం బెన్నీ డయల్‌, కన్నడ విజయ్‌ ప్రకాష్‌, మలయాళం రాహుల్‌ నంబియార్‌ ఆలపించబోతున్నారు. 

ఈ సినిమా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు వైరల్‌గా మారింది. అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గా నిలిచింది. 

click me!