విషాదంః ప్రముఖ దర్శక నటుడు ఇరుగు గిరిధర్‌ కన్నుమూత

By Aithagoni RajuFirst Published Aug 2, 2021, 12:37 PM IST
Highlights

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్‌(4) కన్నుమూశారు. ఆదివారం ఆయన తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి అనారోగ్యంతోనే పోరాడుతున్నారు. చివరికి ఆదివారం ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో గిరిధర్‌ మృతి పట్ల టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న జన్మించారు ఇరుగు గిరిధర్‌. 1982లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అందులో భాగంగా `గుడుంబా శంకర్`, `అన్నవరం`, `వన్`, `సుప్రీమ్`, `వరుడు` వంటి సినిమాలకు కోడైరెక్టర్‌గానూ పనిచేశారు. చంద్రమోహన్, ఆమని, ఇంద్రజ, వినోద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన `శుభముహూర్తం` సినిమాకు దర్శకత్వం వహించి, తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టాడు. అలాగే `ఎక్స్‌ప్రెస్ రాజా`, `100 పర్సంట్ లవ్`, `సర్దార్ గబ్బర్ సింగ్`, `శ్రీమంతుడు` తదితర 20 సినిమాల్లో నటించారు. 
 

click me!