Pornography case: సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేసిన రాజ్ కుంద్రా

Published : Nov 02, 2021, 03:58 PM IST
Pornography case: సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేసిన రాజ్ కుంద్రా

సారాంశం

Raj kundra జులై 19న అరెస్ట్ కావడం జరిగింది. కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా అస్లీల చిత్రాలు ప్రదర్శిస్తున్నారు, అనే ఆరోపణలపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు.

బిజినెస్ మాన్, శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సోషల్ మీడియాకు దూరమయ్యాడు. కొద్దిరోజుల క్రితం పోర్న్ చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా తాజాగా తన ఇంస్టాగ్రామ్, Twitter అకౌంట్స్ డిలీట్ చేశారు. రాజ్ కుంద్రా సోషల్ మీడియాలో చాల యాక్టీవ్ గా ఉంటారు. తరచుగా ఆయన ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉండేవారు. జైలు నుండి విడుదలైన తర్వాత రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా అకౌంట్ Instagram లో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం మానేశారు. 


Raj kundra జులై 19న అరెస్ట్ కావడం జరిగింది. కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా అస్లీల చిత్రాలు ప్రదర్శిస్తున్నారు, అనే ఆరోపణలపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రెండు నెలలు జైలు జీవితం గడిపిన కుంద్రా సెప్టెంబర్ లో విడుదల కావడం జరిగింది. రాజ్ కుంద్రా అరెస్ట్ అనంతరం భార్య శిల్పా శెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోషల్ మీడియాకు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి దూరంగా ఉన్నారు. 


ఇక ఈ పోర్నోగ్రఫీ కేసు గురించి చెప్పాలంటే.. ముంబై శివారులో గల ఓ బంగ్లాలో పోర్న్ వీడియోల చిత్రీకరణ జరుగుతుందనే సమాచారంతో మాల్వానీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కొందరిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అది జరిగిన నెలల తరువాత రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ చిత్రీకరణ, ప్రసారం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో కీలక సూత్రధారి రాజ్ కుంద్రా అని, తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Also read హృదయం బరువెక్కింది, రాత్రంతా నిద్రపట్టలేదు... సూర్య జై భీమ్ పై సీఎం స్టాలిన్ రివ్యూ
ఇక కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్న Shilpa shetty నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆమె పలు టెలివిజన్ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇటీవల కార్వా చౌతా జరుపుకున్న శిల్పాల శెట్టి, సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ వీడియోలు రాజ్ కుంద్రా తల్లి పంపిన బహుమతులతో కూడిన బాస్కెట్ కనిపించింది. శిల్పా శెట్టి నటించిన హంగామా 2 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. నికమ్మ టైటిల్ తో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో ఆమె నటిస్తున్నారు. 

Also read సూర్య 'జై భీమ్' రివ్యూ
 

PREV
click me!

Recommended Stories

Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?