చెప్పులేసుకుని జాతీయ జెండా ఎగరేస్తావా? శిల్పా శెట్టిపై ట్రోలింగ్, నటి ఘాటు రిప్లై

Published : Aug 16, 2023, 10:20 AM IST
  చెప్పులేసుకుని జాతీయ జెండా ఎగరేస్తావా? శిల్పా శెట్టిపై ట్రోలింగ్, నటి ఘాటు రిప్లై

సారాంశం

స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా తన నివాసంలో జాతీయజెండా ఎగురవేసిన ఆమె ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పంచుకుంది

 
ఎప్పుడూ ఏదో వివాదంలో నానుతూనే ఉంటుంది శిల్పా శెట్టి. ముఖ్యంగా నెట్టింట్లో తరచూ ట్రోలింగ్ బారిన పడుతూంటుంది. కొన్ని సార్లు సైలెంట్ అయ్యిపోయే ఆమె ఈ సారి మాత్రం ట్రోలింగ్స్ కు గట్టిగా రిప్లై ఇచ్చింది.   స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా తన నివాసంలో జాతీయజెండా ఎగురవేసిన ఆమె ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మిడియాలో షేర్ చేసుకుంది. ఆ వీడియోలో, శిల్ప చెప్పులేసుకుని జాతీయ జెండా ఎగరేయడంతో ట్రోలింగ్‌ మొదలైంది. అయితే, ఈసారి ఏమాత్రం వెనక్కు తగ్గని శిల్ప ట్రోలర్ల కు ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఈ వీడియో చూడండి. 

ఇక ఆమె ఏమని రిప్లై ఇచ్చిందంటే... త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల (ఫ్లాగ్ కోడ్) గురించి తనకు పూర్తి అవగాహన ఉందని శిల్ప స్పష్టం చేసింది. చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్‌లో ఎక్కడా లేదని ఆమె స్పష్టం చేసింది. తన వాదనకు బలం చేకూర్చేలా గూగుల్‌లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ నెట్టింట షేర్ చేసింది. ట్రోలర్లు తమ అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించడం నచ్చలేదని అంది. వాస్తవాలు తెలుసుకోవాలంటూ వారిని మందలించింది.  

ఇదిలా ఉంటే రీసెంట్ గా  శిల్పాశెట్టికి ముంబయి కోర్టు ఊరటనిచ్చింది. హాలీవుడ్‌ స్టార్‌ రిచర్డ్‌ గెరెతో స్టేజ్‌పైనే ముద్దుల వ్యవహారంలో శిల్పాశెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ముంబయి కోర్టు స్పష్టం చేసింది. ముద్దుపెట్టింది రిచర్డ్‌ గెరె అని.. నటి కాదంటూ కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. శెల్పాశెట్టికి ముద్దు పెట్టడంపై రిచర్డ్‌.. ‘ముద్దుతో ఎయిడ్స్‌ వ్యాపించదన్న సందేశాన్ని ఇచ్చేందుకు స్టేజ్‌పై తాను అలా చేశానంటూ’ వివరణ ఇచ్చారు. ఇద్దరి ప్రవర్తన అసభ్యకరంగా ఉందటూ రాజస్థాన్‌తో పాటు ముంబయిలో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసు విచారణ జరగ్గా.. శిల్పాశెట్టిపై ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. అయితే, పబ్లిసిటీ కోసమే తనపై కేసు పెట్టారంటూ శిల్పా ఆరోపించింది.   శిల్ప త్వరలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌లో నటించనుంది. ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరిట నిర్మితమవుతున్న ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే