భయపడక్కర్లేదు `సలార్` ఆ విషయంలో నెగిటివ్ అవ్వదు

Published : Aug 16, 2023, 08:56 AM IST
భయపడక్కర్లేదు `సలార్` ఆ విషయంలో నెగిటివ్ అవ్వదు

సారాంశం

ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టిస్తున్న ఈ భారీ యాక్ష‌న్ డ్రామాకు ప్ర‌శాంత్ నీల్ (Prashanth neel) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `కేజీఎఫ్‌`(KGF) సీరీస్ చిత్రాలు వ‌రుస‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం, 


ప్ర‌భాస్ రీసెంట్ ఫిల్మ్  `ఆదిపురుష్‌`  అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాక‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌కు గురైన అభిమానులు సలార్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్న హైవొల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద సెప్టెంబ‌ర్ 28న భారీ స్థాయిలో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్న ఈ మూవీపై  ట్రేడ్ లో  భారీ లెక్క‌లు వేస్తున్నారు. ఫ‌స్ట్ డే రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. అయితే ఈ లోగా ఈ సినిమా గురించిన ఓ చిన్న అప్డేట్ బయిటకు వచ్చింది. అది చూపెట్టి కొందరు నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. 

ఆ అప్డేట్ ఏమిటంటే 180 నిముషాలు అంటే  3 గంటల రన్ టైమ్ తో ఈ సినిమా థియేటర్స్ లో దూకనుంది. ఇది ఓ రకంగా లెంగ్తీ రన్ టైమ్ అని చెప్పాలి.  అయితే కేజీఎఫ్ రెండు పార్ట్ లు కూడా బాగా లెంగ్తీ గానే ఉంటాయి. అయినా భాక్సాఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ ఏమీ పడలేదు. కాబట్టి ఈ సినిమా కూడా లెంగ్త్ పరంగా భయపడాల్సిందేమీ లేదంటున్నారు. ఎక్కడా గ్యాప్ లేకుండా, ఎంగేజ్ చేస్తే చాలు , అది ప్రశాంత్ నీల్ చేయగలడు అనే నమ్మకం ఉంది. 

 సినిమాలో ఎక్కువ శాతం యాక్ష‌న్ సీన్లే ఉంటాయ‌ని, అవి హైవోల్టేజ్‌తో సాగుతాయ‌ని, ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. ఇందులో ప్ర‌భాస్‌ని మోస్ట్ వైలెంట్ మ్యాన్‌గా ప్ర‌శాంత్ నీల్ చూపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఊహించ‌ని క‌థ‌, క‌థ‌నాల‌తో రానున్న ఈ సినిమా ఖ‌చ్చితంగా బాక్సాఫీస్ వ‌ద్ద వెయ్యి కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.
 
 మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, జ‌గ‌ప‌తిబాబు ఇందులో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో శ్రియారెడ్డి, ర‌క్షిత్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్‌గా మారింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే