కార్తికేయ 3 మరొక అద్భుతమైన రహస్యం అని.. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచే, దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ఎవరు చూడని, వినని ప్రాచీన సాంస్కృతిక చరిత్ర
నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోనూ ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో నిఖిల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుకుంది. ఈ క్రమంలో కార్తికేయ 2 కాకుండా.. సిక్వెల్ పై ఉంటుందనే హింట్ ఇవ్వడంతో.. ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కార్తికేయ 3 ఎలా ఉంటుందంటూ అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న నిఖిల్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
గతంలో తనను అందరు ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 సినిమా ఎప్పుడు వస్తుందని అడిగేవారని.. ఇప్పుడు కార్తికేయ 3 గురించి అడుగుతున్నారని చెప్పాడు. ఈ సినిమా సీక్వెల్ చేసేవరకు తనను వదిలేలా లేరని.. ముఖ్యంగా ఈ మూవీ సీక్వెల్ తీయకపోతే మా అమ్మగారు వదలరంటూ చెప్పుకొచ్చాడు. అలాగే కార్తికేయ 3 మరొక అద్భుతమైన రహస్యం అని.. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచే, దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ఎవరు చూడని, వినని ప్రాచీన సాంస్కృతిక చరిత్ర అని తెలిపారు నిఖిల్. ఈ క్రమంలోనే కార్తికేయ 3 పై బజ్ ఏర్పడింది. అక్కడిదాకా బాగానే ఉంది.
తాజాగా మరోసారి కార్తికేయ 3 పై మాట్లాడారు డైరెక్టర్ చందు. కార్తికేయ 2 సినిమా రిలీజయి సంవత్సరం అయినందుకు గాను చిత్రయూనిట్ మీడియాతో స్పెషల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆందులో డైరెక్టర్ చందూ మొండేటితో పాటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడంతో పార్ట్ 3 కూడా ఉండబోతుందనే క్లూ ఇచ్చేసారు. అంతేకాదు ఈ విషయంపై అఫిషీయల్‌గా కార్తికేయ3 కథ రెడీ చేశామని త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్ చందూ మొండేటి ప్రకటించారు. నిఖిల్ కార్తికేయ 3 కి చందూ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడని అన్నారు.
చందూ మాట్లాడుతూ....నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. నా చేతిలో ఒక సినిమా ఉంది. అతనివి మూడు సినిమాలు నాదొక సినిమా అయిపోయిన తర్వాత కార్తికేయ 3 ఉంటుంది. ఈ సారి మరింత భారీగా ఉంటుంది అని తెలిపాడు.
అయితే ఈ ప్రకటనలే ఇప్పుడు ఇబ్బంది తెచ్చి పెట్టాయని తెలుస్తోంది.2014లో కార్తికేయ సినిమా విడుదలై అప్పుడు సూపర్ హిట్ అయింది. కానీ అప్పట్లో రిలీజ్ సమయంలో చిత్ర యూనిట్‌కు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చాయట. ఆ సమయంలో వారికి 'భమ్ భోలేనాథ్' సినిమా నిర్మించిన సిరువూరి రాజేష్ వర్మ అనే నిర్మాత ఫైనాన్స్ చేసి రిలీజ్‌కు సాయం చేశారట. ఆప్పుడు ఆయన కార్తికేయ ఫ్రాంచైజ్ హక్కులు అగ్రీమెంట్స్ ద్వారా తీసుకున్నారట. అయితే కార్తికేయ 2 కు రాజేష్ నిఖిల్ తో ఉన్న రేలషన్ తో ఎటువంటి డబ్బులు తీసుకోకుండా NOC ఇచ్చారట. ఆ సినిమా లో రాజేష్ కు థాంక్స్ కార్డు కూడా వేశారు.
రాజేష్ కు కార్తికేయ 3 చేసే ఆలోచన ఉందట.తాజాగ కార్తికేయ 3 విషయంలో తనకు మాట మాత్రం చెప్పకుండా ప్రకటన చెయ్యడమే కాకుండా ఇంకో ప్రొడ్యూసర్‌తో మూవీ చెయ్యడానికి రెడీ అయిపోవడంతో రాజేష్ అభ్యంతరం తెలుపుతున్నాడట. తన ప్రమేయం లేకుండా ఈ ప్రాజెక్ట్‌పై ఎవరైనా ముందుకు వెళ్తే అన్ని లీగల్ నోటీసులు జారీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రిలీజ్ కాకముందే వివాదం మొదలైనట్లే ..ఎలా ముగుస్తుందో చూడాలి!
ఇక ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోన్న సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో కార్తికేయ కథ కొనసాగితే ద్వారక నేపథ్యంలో కార్తికేయ 2 కథ కొనసాగింది. ఇక కార్తికేయ 3 కథ అంతా కూడా అయోధ్య నేపథ్యంలో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అంటే ఈసారి కథ శ్రీరాముడికి సంబంధించిన రహస్యాలతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.