Rajasekar : హీరో రాజశేఖర్ కు బర్త్ డే గిప్ట్.. శేఖర్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్..

Published : Feb 04, 2022, 01:40 PM IST
Rajasekar : హీరో రాజశేఖర్ కు బర్త్ డే గిప్ట్.. శేఖర్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్..

సారాంశం

యాంగ్రీ స్టార్ రాజశేఖర్(Rajasekhar) సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన శేఖర్(Shekar) మూవీ త్వరలో థియేటర్లోకి రాబోతోంది.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్(Rajasekhar) సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన శేఖర్(Shekar) మూవీ త్వరలో థియేటర్లోకి రాబోతోంది.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్(Rajasekhar)  హీరోగా.. ఆయన భార్య జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శేఖర్. ఈ మధ్య డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాడు రాజశేకర్ (Rajasekhar)  . కల్కీ,గరుడవేగలాంటి సినిమాలతో ఆడియన్స్ ను అలరించాడు. ఇప్పుడు శేఖర్ సినిమా కూడా ఇలా డిఫరెంట్ గానే ప్లాన్ చేస్తున్నారు.  ఫస్టులుక్ తోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి రాజశేఖర్ (Rajasekhar)   కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

ఇక ఈ రోజున రాజశేఖర్(Rajasekhar) పుట్టినరోజు కావడంతో.. శేఖర్ సినిమా టీమ్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.  ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.ఓ సన్నజాజి తీగలా అల్లుకోవే నన్నిలా .. కిన్నెరా .. ఓ కిన్నెరా, సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా అంటూ సాగే పాట ఆడియన్ ను బాగా ఆకట్టుకుంది.  అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు.


ఇక ఈమూవీ మలయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. మాలీవుడ్ లో  ఆ మధ్య వచ్చిన జోసెఫ్ కి శేఖర్ సినిమా రీమేక్.అయితే  ఒరిజినల్ మలయాళ సినిమాలో పాటులు లేవు. సినిమా అంతా చాలా  సీరియస్ గా నడుస్తుంది. కానీ మన తెలుగు నేటివిటీకి తగినట్టుగా పాటలతో పాటు ఎంటర్టైన్మెంట్ ను.. కాస్త రొమాన్స్ ను జోడించినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో రాజశేఖర్ (Rajasekhar) రిటైర్మెంట్ తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అతని  జీవితంలో రిటైర్మెంట్ తీసుకున్న తరువాత  చోటుచేసుకున్న సంఘటనలతో ఈ కథ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే