Naga Vamshi : హీరోయిన్ ను ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే అస్సలు వదలను.. బీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ ‘నాగవంశీ’..

Published : Feb 04, 2022, 01:32 PM IST
Naga Vamshi : హీరోయిన్ ను  ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే అస్సలు వదలను.. బీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ ‘నాగవంశీ’..

సారాంశం

రోమాంటిక్  అండ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ‘డిజే టిల్లు’. ఈ మూవీ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది. ఈమూవీ ప్రమోషన్స్ లోభాగంగా ప్రొడ్యూసర్ ‘నాగవంశీ’ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరోయిన్ పై బోల్డ్ కామెంట్ చేశారు.  

సితార ఎంటర్టైన్ మెంట్స్ పతాకం ద్వారా ప్రొడ్యూసర్ నాగ వంశీ గ్యాప్ లేకుండా డిఫరెంట్ సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల ‘డీజే టిల్లు’, బీమ్లా నాయక్ వంటి చిత్రాలను నిర్మించారు. కాగా, డీజే టిల్లు మూవీ ట్రైలర్ లాంచ్ లో నాగ వంశీ మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భీమ్లా నాయక్ వంటి సినిమాను నిర్మించిన నాగ వంశీ ఒక్కసారిగా తన మాటలతో అందరినీ  షాక్ కు గురిచేశాడు. 

ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అందమైన హీరోయిన్ ను ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే ఎందుకు మిస్ చేసుకుంటానంటూ బోల్డ్ అన్సర్ ఇచ్చారు. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే నాగ వంశీ ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించారు. బోల్డ్ టాక్ తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం విషయం నెట్టింట చర్చగా మారింది. 

ప్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మూవీలతో ఎక్కువగా బాక్సాఫీస్ హిట్ సినిమాలను నిర్మించింది హారిక హాసిని ప్రొడక్షన్స్. ఆ సంస్థ అధినేత చిన బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వరుసగా సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.  ఇక చిన బాబు కుమారుడు నాగ వంశీ కూడా సితార ఎంటర్టైన్ మెంట్స్ లో ఎక్కువగా చిన్న సినిమాలను నిర్మించారు.  

స్వాతి ముత్యం, జెర్సీ, బీష్మ, డీజే టిల్లు వంటి సినిమాలను నిర్మించి ఇటు కొత్త దర్శకులకు, అటు నటీనటులకు మంచి అవకాశాలను కల్పిస్తున్నదని సితారా ఎంటర్ టైన్ మెంట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బీమ్లా నాయక్’ వంటి పెద్ద సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ‘జాతిరత్నం’ ఫేమ్  నవీన్ పొలిశెట్టి అప్ కమింగ్ ఫిల్మ్ ‘అనగనగా ఒక రాజు’ మూవీని కూడా సితారా ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది.

 

https://www.youtube.com/watch?v=44Fwnn8QB1w

ప్రస్తుతం డీజే టిల్లు మూవీ ప్రమోషన్ లో ఉన్న నాగవంశీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ అందరినీ షాక్ కు గురిచేశాడు. డిజే టిల్లు సినిమా మీ బయోపిక్ అనుకోవచ్చా అని ఒక విలేకరి అడగడంతో.. ఇంత అందమైన అమ్మాయిని ముద్దుపెట్టుకునే అవకాశం వస్తే నేనే యాక్ట్ చేస్తానంటూ కొంటేగా ఆన్సర్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. మరోవైపు డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ తరువాత ఇక త్వరలోనే డీజే టిల్లు వంటి సినిమాలు కూడా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

మరోవైపు 'ట్రైలర్‌లో ఆమెకు 16 పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మరి నిజంగా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అని అడిగాడు. దీంతో కంగు తిన్న హీరో సిద్ధు ఈ ప్రశ్నను వదిలేయండి అని బదులిచ్చాడు. కానీ ఆ మాటలకు నేహాశెట్టి ఫీలైంది. అలాంటి ప్రశ్న ఎలా అడుగుతారని బాధపడింది. 'ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఈ ప్రశ్న ఎదురవడం చాలా దురదృష్టకరం.. దీన్ని బట్టి అతడు అతడు తన చుట్టూ ఉండే మహిళలను ఎంత గౌరవిస్తున్నాడో తెలుస్తోంది' అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. దీనికి నాగవంశీ స్పందిస్తూ హీరోయిన్ కు కలిగిన ఇబ్బందికి క్షమాపణ చెప్పారు. కానీ మళ్లీ  బోల్డ్ కామెంట్ చేసి నోరుజారడంతో నెట్టింట రచ్చరచ్చ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే