Naga Chaitanya New Look :నాగ చైతన్య క్రేజీ లుక్ వైరల్.. కెరీర్ లో తొలిసారి ఇలా!

By team telugu  |  First Published Feb 4, 2022, 1:15 PM IST

నాగ చైతన్య కొత్త లుక్ లో ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో మంచి జోరుమీదున్నాడు. గత ఏడాది ద్వితీయార్థంలో చైతు 'లవ్ స్టోరీ' చిత్రంతో ఘన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతికి 'బంగార్రాజు'తో బరిలోకి దిగి హిట్ కొట్టాడు. ప్రస్తుతం చైతు 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' అనే మూవీలో నటిస్తున్నాడు. 

ఈ మూవీలో చైతూకి జోడిగా రాశిఖన్నా నటిస్తోంది. ఆసక్తికరమైన ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సమంతతో విడాకుల తర్వాత చైతు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పటికి.. ప్రొఫెషనల్ కెరీర్ మాత్రం బాగానే సాగుతోంది. థాంక్యూ మూవీలో అవికా గోర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. 

Latest Videos

ప్రస్తుతం చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగ చైతన్య సోషల్ మీడియాలో తన కొత్త లుక్ ని షేర్ చేశాడు. కళ్ళజోడు ధరించిన చైతు ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. చైతు ఇంతకు ముందెప్పుడూ ఇంత ఇంటెన్స్ గా కనిపించలేదు అని చెప్పాలి. చైతు ముఖంలో కూల్ నెస్, సీరియస్ రెండూ ఒకేసారి కనిపిస్తున్నాయి.  

తన లుక్ క్రెడిట్ ని చైతు కెమెరామెన్ పిసి శ్రీరామ్ కి ఇచ్చారు. ప్రస్తుతం చైతు లుక్ నెట్టింట వైరల్ గా మారింది. చూస్తుంటే నాగ చైతన్య, విక్రమ్ కుమార్ బలమైన చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థం అవుతోంది. 

click me!