Bigg Boss 5 Grand Finale: 'శ్యామ్ సింగ రాయ్' ఆఫర్ కి నో.. మానస్ అవుట్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 19, 2021, 09:21 PM IST
Bigg Boss 5 Grand Finale: 'శ్యామ్ సింగ రాయ్' ఆఫర్ కి నో.. మానస్ అవుట్

సారాంశం

కింగ్ నాగార్జున హోస్ట్  గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరుగుతోంది. గత 105 రోజులుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ తుది దశకు చేరుకోవడంతో విజేత ఎవరనే ఉత్కంఠ నెలకొంది. 

కింగ్ నాగార్జున హోస్ట్  గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరుగుతోంది. గత 105 రోజులుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ తుది దశకు చేరుకోవడంతో విజేత ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సిరి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సన్నీ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. వీరిలో విజేత ఎవరనేది ప్రశ్న. 

టాప్ 5 కంటెస్టెంట్స్ లో ముందుగా సిరి ఎలిమినేట్ అయింది. మరో కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసేందుకు శ్యామ్ సింగ రాయ్ మూవీ టీం నాని, సాయి పల్లవి, కృతి శెట్టి బిగ్ బాస్ వేదికపైకి ఎంటర్ అయ్యారు. నాగార్జున వారితో శ్యామ్ సింగ రాయ్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టిల పాత్రల గురించి నాగార్జున ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. 

మిగిలిన నలుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతని నాగార్జున శ్యామ్ సింగరాయ్ టీంకి అప్పగించారు. దీనితో నాని, సాయి పల్లవి, కృతి శెట్టి హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. నాని డబ్బు ఉన్న సూట్కేస్ తో హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. మీ నలుగురిలో ఒకరే విజేత. కొంచెం ప్రాక్టికల్ గా అలోచించి డౌట్ ఉన్నవారు ఈ సూట్కేస్ తీసుకుని వెళ్లిపోండి అని ఆఫర్ ఇచ్చాడు. సూట్కేస్ చాలా బరువు ఉంది. అంటే చాలా డబ్బు ఉండి ఉంటుంది అంటూ ఊరించారు. కానీ సూట్కేస్ ఆఫర్ కోసం ఎవరూ ముందుకు రాలేదు. 

దీనితో అసలైన ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. రాడ్ లాంటి పరికరాన్ని లాగినప్పుడు ఎవరి ఫోటో ఉన్న బొమ్మ కింద పడిపోతుందో వారు ఎలిమినేట్ అయినట్లు. ఈ గేమ్ ని ముందుగా సన్నీతో ప్రారంభించారు. సన్నీ సేఫ్ అయ్యాడు. ;షణ్ముఖ్ కూడా సేఫ్. ఇక మిగిలిన మానస్, శ్రీరామ్ ఒకేసారి రాడ్ లాగారు. మానస్ బొమ్మ కింద పడిపోయింది. దీనితో అతడు ఎలిమినేట్ అయ్యాడు.ఎలిమినేట్ కావడంతో వేదికపైకి వచ్చిన మానస్.. నాగార్జునతో మాట్లాడాడు. తన ప్రకారం సన్నీ విజేతగా నిలిస్తే బావుంటుంది అని చెప్పాడు. ఇక ఫైనల్ రేసులో మిగిలింది శ్రీరామ్, షణ్ముఖ్, సన్నీ ముగ్గురే. 

Also Read: BIG BOSS-5 ALIA BHAT: ఐలవ్యూ చెప్పిన ఆలియా భట్.. తట్టుకోలేక పడిపోయిన సన్నీ.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే