BIG BOSS-5 RAJAMOULI: బ్రహ్మాస్త్రా కథ మొత్తం చెప్పేసిన రాజమౌళి..

Published : Dec 19, 2021, 08:42 PM IST
BIG BOSS-5 RAJAMOULI:  బ్రహ్మాస్త్రా కథ మొత్తం చెప్పేసిన రాజమౌళి..

సారాంశం

హడావిడిలో  బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రా స్టోరీ మొత్తం చెప్పేసారు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. బిగ్ బాస్5  గ్రాండ్ ఫినాలేకు రాజమౌళితో పాటు బ్రాహ్మస్త్రా టీమ్ అంతా వచ్చారు. ఈ సందర్భంగా కథను వివరించారు జక్కన్న

బిగ్ బాస్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈ ఈవెంట్ కు ఫస్ట్ స్టార్ గెస్ట్ గా ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి వచ్చారు. ఆయనతో పాటు బ్రహ్మాస్త్రా టీమ్ కూడా వచ్చారు. హీరో రణ్ భీర్ కపూర్... హీరోయిన్ ఆలియాతో పాటు.. డైరెక్టర్ అయాన్ కూడా ఈ షోలో జాయిన్ అయ్యారు. బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రాలో నాగార్జున కూడా చేస్తుండటంతో స్టేజ్ పైన సందడి వాతావరణం నెలకొంది.  

 

ఇక ఈమూవీ గురించి కథ మొత్తం చెప్పేశారు రాజమౌళి. ఒక సామాన్యుడికి పవర్ ఫుల్  అస్త్రం దొరికితే ఎలా ఉంటుంది. అది ఎలా ఉపయోగించాడు అనేది.. డైరెక్టర్ అయాన్ బాగా చూపించాడన్నారు. అందులో హీరో శివ పాత్రలో రణ్ భీర్... ఈషా పాత్రలో ఆలియా భట్ నటిస్తున్నట్టు.. కథలో కీలక సన్నివేశాలు వివరించుకుంటూ వచ్చారు రాజమౌళి. ఒక రకంగా జక్కన్న బిగ్ బాస్ స్టేజ్ పై కాసేపు హోస్ట్ అవతారు ఎత్తారు.

BIG BOSS-5 తప్పు చేశానని ఒప్పుకున్న సిరివాళ్లమ్మ... షణ్ముఖ్ ను రాయితో పోల్చిన తండ్రి..

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ గా షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి వచ్చారు. ఇందులో సిరి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది.  గ్రాండ్ ఫినాలే కోసం స్టార్స్ గెస్ట్ లు బిగ్ బాస్ కు వరసకట్టారు రాజమౌళి టీమ్ తో పాటు పుష్ప టీమ్, శ్యామ్ సింగరాయ్ టీమ్, ఇలా చాలా మంది స్టార్ గెస్ట్ లు బిగ్ బాస్ 5 స్టేజ్ పై సందడి చేశారు.

 

15 వారాలు 100 రోజులకు పైగా బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఈ సీజన్ తో కలుకుపుకుని మూడు సీజన్లను కింగ్ నాగార్జున సూపర్  సక్సెస్ ఫుల్ గా హోస్టింగ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?