శర్వానంద్ రేంజ్ పెరిగింది.. రిలీజ్ కు ముందే లాభాలు!

Published : Nov 21, 2018, 01:27 PM IST
శర్వానంద్ రేంజ్ పెరిగింది.. రిలీజ్ కు ముందే లాభాలు!

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొంత కాలంగా వరుస విజయాలతో తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ముఖ్యంగా శతమానం భవతి - మహానుభావుడు సినిమాలు ఈ యువ హీరోకి మంచి బూస్ట్ ఇచ్చాయి.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొంత కాలంగా వరుస విజయాలతో తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ముఖ్యంగా శతమానం భవతి - మహానుభావుడు సినిమాలు ఈ యువ హీరోకి మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇకపోతే ఎప్పుడు లేని విధంగా శర్వా సినిమా డిజిటల్ వరల్డ్ లో మంచి బిజినెస్ చేసింది. 

హనురాఘవపూడి దర్శకత్వంలో శర్వా ప్రస్తుతం పడి పడి లేచే మనసు అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. టీజర్ అండ్ టైటిల్ ట్రాక్ తో సినిమాపై ఆసక్తి పెరిగింది. సాయి పల్లవి కథానాయిక కావడంతో సినిమా రిలీజ్ కోసం ఓ వర్గం వారు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. 

ఇక అమెజాన్ ప్రైమ్ కూడా సినిమాను మంచి రేట్ కు దక్కించుకోగా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా కూడా నిర్మాతకు బాగానే అందాయి. మొత్తంగా సినిమా ఈ మార్గంలో 12 కోట్లను అందించింది. దాదాపు సినిమాకు పెట్టిన బడ్జెట్ లో చాలా వరకు వెనక్కి వచ్చాయని చెప్పవచ్చు. శర్వా కెరీర్ లో ఏ సినిమా కూడా రిలీజ్ కు ముందు ఈ రేంజ్ లో బిజినెస్ చేయలేదు.  ఇక సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు