మేకప్ లేకుండా రష్మిక ఫొటో, బెంబేలెత్తుతున్న ఫ్యాన్స్

By Udayavani DhuliFirst Published Nov 21, 2018, 1:24 PM IST
Highlights

మేకప్ లేకుండా సినిమావాళ్లను గుర్తు పట్టడం కష్టం అంటూంటారు. ఎందుకంటే కెమెరా కన్ను ద్వారా మనం చూసే రూపం వేరుగా ఉంటుంది..అసలురూపం వేరుగా ఉంటూంటుంది. 

మేకప్ లేకుండా సినిమావాళ్లను గుర్తు పట్టడం కష్టం అంటూంటారు. ఎందుకంటే కెమెరా కన్ను ద్వారా మనం చూసే రూపం వేరుగా ఉంటుంది..అసలురూపం వేరుగా ఉంటూంటుంది. ఈ విషయం హీరో,హీరోయిన్స్ కు స్పష్టంగా తెలుసు. అందుకే వాళ్లు పబ్లిక్ లోకి వెళ్లేటప్పుడు...తమ ఫొటోలు బయిటకు వెళ్లేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటూంటారు.

ఎందుకంటే గ్లామరే కదా వారికి భరోసా. అయితే ఈ విషయం తెలియకా లేక తెలిసినా అభిమానులను టీజ్ చేద్దామనుకుందో రష్మిక తను మేకప్ లేకుండా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పెట్టింది. అది చూసిన ఫ్యాన్స్  ఇలా ఉందేంటి ఈమె అని బెంబేలెత్తుతున్నారు. మీరు ఇక్కడ ఆ ఫొటో ని చూడవచ్చు. 

కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' హిట్ తో 'రష్మిక మందన'   క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగు వారి దృష్టి ఆమెపై పడింది.  నాగశౌర్యతో చేసిన ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ‘గీత గోవిందం’తో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది   రష్మిక అద్భుత నటన కారణంగా దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె వైపే చూస్తున్నారు.  తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో ఆమెకు బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయి. 

తనకు గీతా గోవిందం సినిమాతో హిట్ ఇచ్చిన విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తోంది. అలాగే ‘దేవదాస్’లో నానితో జత కట్టింది. ఇవే కాకుండా పలు కన్నడ సినిమాలను ఒప్పుకుంది. రష్మిక కెరీర్ అయితే ప్రస్తుతం పరుగులు తీస్తోంది. అయితే ఇలాంటి ఫొటోలతో ఆమె భయపెట్టకుండా ఉంటే  బాగుంటుంది. 

click me!
Last Updated Nov 21, 2018, 1:25 PM IST
click me!