చిన్న నిర్మాతను సునీల్ ఇబ్బంది పెడుతున్నాడా..?

By Udayavani DhuliFirst Published Nov 21, 2018, 1:11 PM IST
Highlights

కమెడియన్ సునీల్ హీరోగా మారి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని హిట్లను కూడా అందుకున్నాడు. కానీ కొన్నాళ్లకు ప్రేక్షకులకు సునీల్ సినిమాలపై ఆసక్తి తగ్గిపోయింది. దానికి తగ్గట్లుగానే సునీల్ మూస ధోరణిలో సినిమా చేస్తూ మరింత విసిగించాడు. 

ఇప్పుడు హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్లీ కమెడియన్ గా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఇలా ఉండగా.. సునీల్ హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో నిర్మాత బోగాడ అంజిరెడ్డి అతడితో సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు సునీల్ కి కోటి రూపాయల పారితోషికం కూడా ఇచ్చాడు.

సునీల్ కి వరుస ఫ్లాప్ సినిమాలు పడడంతో అతడి మార్కెట్ బాగా దెబ్బతింది. దీంతో నిర్మాత అంజిరెడ్డి తను ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగివ్వమని సునీల్ ని అడిగారట. కానీ సునీల్ మాత్రం అడ్వాన్స్ తిరిగి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. పోనీ సినిమా చేద్దామనుకుంటే.. ఇప్పుడు సునీల్ పై పెట్టుబడి పెట్టడానికి అంజిరెడ్డి సిద్ధంగా లేరట.

అసలు అడ్వాన్స్ తిరిగి ఇస్తారా లేదా..? అనే సందిగ్ధంలో పడిపోయాడు అంజిరెడ్డి. ఇంకొన్ని రోజులు చూసిన తరువాత ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని  అనుకుంటున్నారట. ఓ చిన్న నిర్మాతని సునీల్ ఇలా ఇబ్బంది పెట్టడమేంటని ఇండస్ట్రీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి!

click me!