'ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి'.. శర్వానంద్ 'మనమే' టీజర్ లో భలే ఉందే.. 

Published : Apr 19, 2024, 03:06 PM IST
'ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి'.. శర్వానంద్ 'మనమే' టీజర్ లో భలే ఉందే.. 

సారాంశం

హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలయింది. 

టీజర్ చాలా ఫన్నీగా ఉంటూ అలరిస్తోంది. కృతి శెట్టి, శర్వానంద్ జంట స్క్రీన్ ప్రజెన్స్ చాలా బావుంది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ.. ఆడే విధంగా ఓ బాబుకి తల్లిదండ్రులుగా ఎలా రిలేషన్ షిప్ లో ఉన్నారు లాంటి అంశాలని డైరెక్టర్ చాలా కలర్ ఫుల్ గా షూట్ చేసారు. టీజర్ లో బిజియం ఆకట్టుకునే విధంగా ఉంది. 

శర్వానంద్ ప్లే బాయ్ తరహాలో కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి.. కృతిశెట్టితో ఎలా ప్రేమలో పడ్డాడు అనే అంశం ఉత్కంఠ పెంచుతోంది. 'మంచిగా కనిపించే వాళ్లంతా మంచోళ్ళు కాదురా.. ఉదాహరణకి నేను.. చాలా మంచోడిలా కనిపిస్తా అంటూ శర్వానంద్ డైలాగులతో టీజర్ మొదలవుతుంది. 

 

మరోవైపు కృతి శెట్టి చాలా స్ట్రిక్ట్ గా ఉండే అమ్మాయి. కృతి శెట్టి టీజర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. చివర్లో పిల్లాడు ఏడుస్తుంటే కృతి శెట్టి శర్వానంద్ పై విరుచుకుపడుతుంది. దీనితో శర్వానంద్ ఫన్నీగా.. ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి అంటూ చెప్పే డైలాగ్ హైలైట్. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా