`టిల్లు స్వ్కేర్‌` ఓటీటీ డేట్‌ ఫైనల్.. టిల్లుగాడి ఫ్యాన్స్ కి సడెన్‌ సర్‌ప్రైజ్‌

Published : Apr 19, 2024, 02:32 PM IST
`టిల్లు స్వ్కేర్‌` ఓటీటీ డేట్‌ ఫైనల్.. టిల్లుగాడి ఫ్యాన్స్ కి సడెన్‌ సర్‌ప్రైజ్‌

సారాంశం

`టిల్లు స్వ్కేర్‌` థియేటర్లో నవ్వులు పూయించింది. వంద కోట్లు దాటేసింది. ఇక ఇప్పుడు ఇంట్లో అలరించడానికి వస్తోంది. తాజాగా ఓటీటీ డేట్‌ కన్ఫమ్‌ అయ్యింది.   

ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో `టిల్లు స్వ్కేర్‌` ఒకటి. `హనుమాన్‌` తరహాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. ఈ మూవీ సుమారు 125కోట్ల గ్రాస్‌ సాధించింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాలు సాధించిన చాలా మూవీస్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది. సిద్దు జొన్నలగడ్డ డైలాగ్‌ డెలివరీ, కామెడీ, అనుపమా పరమేశ్వరన్‌ అందాలు ఈ మూవీకి తిరుగులేని విజయాన్ని అందించాయి. 

ఈ మూవీ గత నెల చివరి వారంలో విడుదలై ఆద్యంతం ఆకట్టుకుంది. నవ్వులు పూయిస్తూ ఆడియెన్స్ ని అలరించింది. ఐపీఎల్‌, ఎన్నికల ఫీవర్‌ ఉన్నా కూడా ఈ మూవీ ఇంతటి వసూళ్లని రాబట్టడం విశేషం. తాజాగా ఈ మూవీ టిల్లుగాడి ఫ్యాన్స్ కి సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుంది. ఓటీటీలోకి రాబోతుంది. నెల రోజుల కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. 

నెట్‌ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 26 నుంచి ఇది నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. టిల్లుగాడి ఫ్యాన్స్‌కి నాన్‌ స్టాప్‌గా ఇంట్లోనే అలరించబోతుందని చెప్పొచ్చు. ఇక ఇందులో సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు పాత్రలో నటించగా, ఆయనకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ నటించింది. లల్లీ పాత్రలో మెరిసింది. ఫస్ట్ టైమ్‌ అనుపమా పరమేశ్వరన్‌ చాలా బోల్డ్ గా, గ్లామరస్‌ పాత్రని చేసింది. కుర్రాళ్లని ఓ ఊపు ఊపేసింది. 

మరోవైపు ఇందులో `డీజే టిల్లు` హీరోయిన్‌ నేహా శెట్టి సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇవ్వడం విశేషం. దీంతో సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ఆయా సీన్లు హిలేరియస్‌గా నవ్వించాయి. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఎక్కడా గ్రాఫ్‌ తగ్గకుండా కామెడీని వర్కౌట్‌ చేశారు సిద్దు, దర్శకుడు విమల్‌. అది తెరపై కరెక్ట్ గా వర్కౌట్‌ అయ్యింది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంది. సినిమా పెద్ద విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌