
కూల్ గా తనపని తానను చేసుకుంటూ పోతున్న యంగ్ హీరో శర్వానంద్ సంక్రాంతి రేసులో మెగాస్టార్, బాలయ్యల చిత్రాలున్నా... శతమానంభవతి సినిమాతో రిస్క్ తీసుకుని మరీ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్. ఇప్పటికే సంక్రాంతి బరిలో స్టార్ హీరోలను ఢీకొని సక్సెస్ సాధించిన ఈ యంగ్ హీరో... ఈ సారి వేసవిని టార్గెట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు, ప్రభాస్, రాజమౌళిల బాహుబలి, అల్లు అర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్ లాంటి భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న సమ్మర్ సీజన్లో తన నెక్ట్స్ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
శతమానంభవతి సక్సెస్ తరువాత చంద్రమోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూర్తి కావాల్సింది. శతమానంభవతి సక్సెస్ తరువాత శర్వానంద్ స్వయంగా సినిమాలో కొన్ని మార్పులు సూచించడటంతో షూటింగ్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.