శర్వా పవన్ ను కూడా పిలిచేస్తాడేమో?

Published : Dec 18, 2018, 08:33 PM IST
శర్వా పవన్ ను కూడా పిలిచేస్తాడేమో?

సారాంశం

ప్రతి సినిమాతో మార్కెట్ అనే కాకుండా తన ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటూ వెళుతున్నాడు యువ హీరో శర్వానంద్. ఇప్పుడు పడి పడి లేచే మనసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదట సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ  సాంగ్స్ అండ్ ట్రైలర్ తోనే బజ్ క్రియేట్ చేశారు. 

అంతే కాకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రావడంతో సినిమాపై ఒక్కసారిగా మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈవెంట్ లో పవన్ పేరును కూడా శర్వా ప్రస్తావించాడు. అదే ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. కొందరు అభిమానులు పవర్ స్టార్ అనడంతో ఆయనను కూడా మన ఈవెంట్ కి ఒకరోజు తప్పకుండా పిలుద్దాం అనేశాడు. 

అంతే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు అంటూ శర్వా మ్యాటర్ ని ఫినిష్ చేశాడు. బన్నీది లక్కీ హ్యాండ్ అని పిలిచిన శర్వా ఇప్పుడు పవన్ పై కూడా మనసు పారేసుకోవడం పవన్ అభిమానుల్లో ఆసక్తిని రేపింది. ఆ సమయంలో అభిమానుల సంతోషం మేరకు అని ఉండవచ్చు అనే కామెంట్స్ వస్తున్నా కూడా శర్వా సినిమాకు పవన్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫిదా అయ్యారు. మరి మెగా అభిమానులను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న ఈ కుర్ర హీరో ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌