ఎన్టీఆర్ ఈవెంట్ కోసం అంతా సిద్ధం.. బాలయ్య అదుర్స్!

Published : Dec 18, 2018, 06:58 PM ISTUpdated : Dec 18, 2018, 08:09 PM IST
ఎన్టీఆర్ ఈవెంట్ కోసం అంతా సిద్ధం..  బాలయ్య అదుర్స్!

సారాంశం

నందమూరి తారకరామారావు గారి బయోపిక్ నుంచి మరో స్పెషల్ పోస్టర్ రిలీజయింది. అంతే కాకుండా సినిమా ఆడియో -ట్రైలర్ లాంచ్ వేడుకలకు వేదికను ఫైనల్ చేసినట్లు చెప్పారు. 

నందమూరి తారకరామారావు గారి బయోపిక్ నుంచి మరో స్పెషల్ పోస్టర్ రిలీజయింది. అంతే కాకుండా సినిమా ఆడియో -ట్రైలర్ లాంచ్ వేడుకలకు వేదికను ఫైనల్ చేసినట్లు చెప్పారు. ఫిల్మ్ నగర్ లోని జెఆర్సి కన్వెన్షన్ హల లో డిసెంబర్ 21న సాయంత్రం ఆరు గంటలకు ఈవెంట్ జరగనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. 

పోస్టర్ లో బాలయ్య ఎన్టీఆర్ మరోసారి గుర్తు చేశారు. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే పలు సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారని అందరికి తెలిసిందే. ఇక ఫొటోలో ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తోన్న బాలకృష్ణ అప్పటి కరెన్సీ దండలతో కనిపిస్తూ రిక్షా తొక్కుతున్నారు. ఇది 1978 కాలం నాటి సన్నివేశం. వారాధాబాధితుల కోసం కృష్ణా జిల్లా దివి సీమలో రిక్షా తొక్కి ఎన్టీఆర్ జనాల నుంచి విరాళాలు సేకరించారు.

ఆయనతో పాటు అప్పట్లో నాగేశ్వర రావు గారు కూడా ఉన్నారు. ఇద్దరు అగ్రనటులు రాకతో ఆ ప్రాంతమంతా అప్పట్లో జనసంద్రంతో నిండిపోయింది. జనాలు ఎన్టీఆర్ కు ఘనస్వాగతం పలికి నోట్లను దండలుగా మార్చి ఆయన మేడలో వేశారు. అదే సీన్ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడులో దర్శకుడు క్రిష్ రియాలిటీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక కీరవాణి సంగీతం అందించిన సినిమాను జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?